క్రైమ్/లీగల్

కీచక ఉపాధ్యాయుడి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పీలేరు, జనవరి 22: ఓ వైపు మహిళలపైన, బాలికలపై అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్ష వేసే చట్టాలున్నా, కామంతో కన్ను, మిన్ను తెలియకుండా 57 సంవత్సరాల వయస్సున్న ఉపాధ్యాయుడు 11 సంవత్సరాల విద్యార్థినిపై అత్యాచార యత్నానికి పాల్పడిన దారుణ సంఘటన చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. కేవీపల్లి మండలం ఎస్‌ఐ సోమశేఖర్ కథనం ప్రకారం జంగంపల్లి సమీపంలోని గొల్లపల్లిలో నివాసం ఉంటున్న 11 సంవత్సరాల విద్యార్థిని ప్రాథమిక పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. సంక్రాంతి పండుగ ముందురోజు అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చంద్రశేఖర్ రెడ్డి ఆ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అయితే రెండు రోజుల తరువాత ఆ విద్యార్థిని ఉపాధ్యాయుడు తనపై పాల్పడ్డ దారుణాన్ని అమ్మమ్మకు తెలిపింది. దీంతో బుధవారం బాలిక తండ్రి, అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.