క్రైమ్/లీగల్

జల్సాల కోసం చోరీలు చేసి జైలుపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, జనవరి 22: జల్సాలకు అలవాటు పడి..వాటిని తీర్చుకునేందుకు వరుసగా చోరీలకు పాల్పడిన ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఏసీపీ వెంకటరమణ కథనం ప్రకారం..నార్త్‌జోన్ పరిధిలోని చిలుకలగూడ, గోపాలపురం, లాలగూడ పోలీస్‌స్టేషన్ల పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడిన ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్, కాగజ్‌నగర్‌కు చెందిన సతీష్ కుమార్ పనీపాటా లేకుండా తిరుగుతుండేవాడు. జల్సా జీవితం అలవాటు పడి, సులభంగా డబ్బులు సంపాదించేందుకు దొంగతనాలే మార్గంగా ఎంచుకున్నాడు. గడిచిన ఐదు నెలల్లో చిలుకల గూడ, లాలాగూడ, గోపాలపురం పోలీస్ స్టేషన్‌ల పరిధిలోని రైల్వే క్వార్టర్స్‌లో ఐదు దొంగతనాలు చేసి మొత్తం రూ. 3లక్షల విలువైన బంగారు, వెండి, ఇత్తడి వస్తువులను దొంగిలిచ్చినట్లు తమ విచారణలో వెల్లడైందని పోలీసులు పేర్కొన్నారు. బంగారు ఆభరణాలు మణప్పురంలో తాకట్టు పెట్టడం, వెండి, ఇత్తడి సామగ్రిని ఇతర దుకాణాలలో అమ్మి, వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు. సోమవారం రాత్రి లాలాగూడ రైల్వే క్వార్టర్స్‌లో తాళం వేసి ఉన్న ఇంట్లో నుంచి శబ్దం వస్తున్న విషయాన్ని గమనించిన స్థానికులు 100కు డయల్ ఫోన్ చేసి సమాచారమిచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకునే లోపే దొంగతనానికి పాల్పడిన వ్యక్తి పారిపోయాడు. మంగళవారం బ్లూ బెల్స్ స్కూల్ వద్ద సతీష్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.