క్రైమ్/లీగల్

రాజధాని కేసుల విచారణ ఫిబ్రవరి 26కి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (లీగల్): రాష్ట్రంలో రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డిఏ రద్దు చేయడంపై దాఖలైన కేసుల విచారణను ఫిబ్రవరి 26వ తేదీకి వాయిదా వేస్తూ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జస్వంత్‌కుమార్ మహేశ్వరి గురువారం ఆదేశించారు. ఈ అంశాలతోపాటు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై పిటిషనర్ల తరపు న్యాయవాది అశోక్‌భన్ కోర్టుకు వివరించారు. దాదాపు 37 మంది రైతులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లకు ఉన్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా, బిల్లు ప్రస్తుతం ఏ స్థితిలో ఉందని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రమణ్యంను ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు.
మండలి పరిణామాలు, సెలెక్ట్ కమిటికి
నివేదించిన అంశాలను సమాధానంగా చెప్పడంతో ఈ కేసులో ప్రస్తుతం విచారణ అవసరం లేదని, బిల్లు చట్టంగా మారేందుకు ఇంకా సమయం ఉన్నందున ఫిబ్రవరి 26వ తేదీకి తదుపరి విచారణకు వాయిదా వస్తున్నట్లు ప్రకటించారు. రైతుల తరపున న్యాయవాది అశోక్‌భన్ లేవనెత్తిన అంశంపై న్యాయమూర్తి మాట్లాడుతూ బిల్లు చట్టంగా మారక ముందే ప్రభుత్వ విభాగాలను తరలిస్తే ఆ ఖర్చును వ్యక్తిగత ఖాతాల నుండి జమ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ కేసుల్లో పిటిషన్లకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. కోర్టు నిర్ణయం వెలువరించేవరకు ఈ కేసుల్లో ఎటువంటి చర్యలు తీసుకోరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇలావుండగా కోర్టులో జరుగుతున్న వాదోపవాదాలను ప్రత్యక్షంగా చూసేందుకు వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపి కేశినేని నాని కూడా కోర్టు హాలుకు రావడం కొసమెరుపు.