క్రైమ్/లీగల్

ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, జనవరి 23: గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యుఎస్) పాడేరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.రాంప్రసాద్ బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక లోచలిపుట్టులోని రెంటల్ హౌసింగ్ కాలనీలోని ఐటీడీఏ క్వార్టర్‌లో నివాసం ఉంటున్న ఆయన ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం అధికార, ఉద్యోగ వర్గాలను తీవ్ర విస్మయానికి గురి చేసింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వంటి ఉన్నత హోదాలో ఉన్న రాంప్రసాద్ ఆత్మహత్య చేసుకునేందుకు గల కారణాలు స్పష్టంగా తెలియరానప్పటికీ కుటుంబ కలహాల వల్లే ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు చెప్పుటుంటున్నారు. గత కొంతకాలంగా ఆయనకు భార్యతో సత్సంబంధాలు లేవని, వీరిద్దరి మధ్య తగాదా నడుస్తోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడడం కుటుంబ తగాదాలే కారణంగా ఆయన సన్నిహితులు భావిస్తున్నారు. గిరిజన ప్రాంతంలో మంచి అధికారిగా పేరు తెచ్చుకున్న రాంప్రసాద్ విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తుంటారని, ఆయన సారథ్యంలో మన్యంలో తాగునీటి పథకాల నిర్మాణం యుద్ధ ప్రాతిపాదికన జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. విశాఖపట్నంలో ఆయన కుటుంబం ఉండడంతో నిత్యం విశాఖ నుంచే పాడేరు వచ్చి విధులు నిర్వర్తిస్తున్నట్టు తెలుస్తోంది. నిత్యం పాడేరు వచ్చే రాంప్రసాద్ పని ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు పాడేరులోనే రెంటల్ హౌసింగ్ కాలనీలోని ఐటీడీఏ క్వార్టర్‌లో బస చేస్తుంటారు. ఈ క్వార్టర్‌లో కొంతమంది వర్క్ ఇన్‌స్పెక్టర్లు ఉంటుంటారని, రాంప్రసాద్ బస చేసే సమయంలో వారితో ఉంటుంటారని అంటున్నారు. అయితే బుధవారం ఉదయం కార్యాలయానికి వెళ్లేందుకు సిద్ధమైన ఆయన పదిన్నర ప్రాంతంలో బయటకు వచ్చి ఫోన్‌లో ఎవరితోనో సంభాషించినట్టు కాలనీ వాసులు చెబుతున్నారు. సెల్ ఫోన్‌లో మాట్లాడిన అనంతరం పదకొండు గంటల ప్రాంతంలో ఇంటి లోపలకు వెళ్లిన ఆయన మంచంపై కుర్చీ వేసి పైకి ఎక్కి లుంగీతో సీలింగ్ ఫాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని క్వార్టర్స్‌లో ఉండే ఉద్యోగులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతున్న ఆయన మృతదేహాన్ని కిందకు దించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇదిలాఉండగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆత్మహత్య విషయం తెలుసుకున్న ఐటీడీఏ అధికారులు, పలు శాఖల అధికారులు, ఉద్యోగులు సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని సంతాపం వ్యక్తం చేసారు. ఈ సంఘటనపై పోలీసులు క్షుణ్ణంగా విచారణ నిర్వహిస్తున్నారు.