క్రైమ్/లీగల్

నిందితుల అరెస్ట్:మోటార్ బైకులు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, జనవరి 23: చిరుప్రాయంలోనే చెడు అలవాట్లు, చెడు స్నేహాల ప్రభావంతో మోటారు బైక్‌ల చోరీలకు అలవాటు పడిన 17ఏళ్ల బాలుడు సహా నలుగురు నిందితులను భవానీపురం క్రైం ఎస్‌ఐ వండ్రంగి కృష్ణబాబు గురువారం ఉదయం అరెస్ట్ చేశారు. వారి నుండి 8 మోటారు బైకులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం ఇటీవల భవానీపురం ప్రాంతంలో పలు మోటారు బైకులు మాయమైయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు క్రైం పోలీసులు కేసులు నమోదు చేశారు. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దొంగలించిన బైక్‌లను అమ్మడానికి సిద్ధంగా ఉంచారని సమాచారం అందిన పోలీసులు భవానీపురం కరకట్ట ప్రాంతంలో నిఘా వేసి చోరీ సొత్తుని, నిందితులను స్టేషన్‌కు తరలించారు. రామరాజ్యనగర్‌కి చెందిన మలిశెట్టి విజయబాబు(23), నూజివీడుకు చెందిన మండా జయకృష్ణ(20), కొండవీటి వివేక్(20), భవానీపురం కరకట్ట ప్రాంతానికి చెందిన 17ఏళ్ల బాలనేరస్తుడు ఓ బృందంగా ఏర్పడి నేరాలకు పాల్పడుతున్నట్లు నేరస్తులు అంగీకరించారు. భవానీపురం సీఐ డీకే మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేపట్టిన క్రైం ఎస్‌ఐ కృష్ణబాబు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుండి 8 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.