క్రైమ్/లీగల్

370 రద్దుపై తీర్పు రిజర్వ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రాన్ని రెండుగా విభజించటంపై దాఖలైన పిటిషన్ల విచారణకు ఎక్కువ మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి పంపించాలా? వద్దా? అనే అంశంపై తీర్పును ఐదుగురు న్యాయమర్తుల సుప్రీం కోర్టు బెంచ్ రిజర్వు చేసింది. న్యాయమూర్తులు ఎన్‌వీ రమణ, ఎస్‌కే కౌల్, ఆర్ సుభాష్‌రెడ్డి, బీఆర్ గవాయ్, సూర్యకాంత్‌తో కూడిన బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని విస్తృత ధర్మాసనానికి పంపాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు జడ్‌ఏ షా, రాజీవ్ ధావన్, చందర్ ఉదయ్‌సింగ్, గోపాల శంకరనారాయణన్, దినేష్ ద్వివేదీ, సంజయ్ పరీఖ్ వాదించారు. ప్రభుత్వం తరపున హాజరైన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాత్రం ఈ అంశాన్ని విస్తృత బెంచ్‌కు పంపించవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు.
దాదాపు 70 సంవత్సరాల పాటు కేంద్ర రాజ్యాంగం, జమ్మూకాశ్మీర్ రాజ్యాంగం కలిసికట్టుగా పని చేశాయి, ఇప్పుడెందుకు సమస్య వచ్చింది, రాష్ట్రాన్ని విభజించవలసి వచ్చిందని ద్వివేదీ ప్రశ్నించారు. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్టికల్ 370 తాత్కాలికమన్న వాదన సరైంది కాదని ఆయన చెప్పారు. రాజ్యాంగంలోని అన్ని ఆర్టికల్స్ సవరించవచ్చు, అంత మాత్రాన అవి తాత్కాలికమని ఎలా చెప్పగలమని ద్వివేదీ ప్రశ్నించారు. ఆర్టికల్ 370 రద్దుతో కేంద్రానికి జమ్మూకాశ్మీర్‌కు ఉన్న సంబంధం తెగిపోయిందని గోపాల శంకరనారాయనన్ వాదించారు. జమ్మూకాశ్మీర్ కన్‌స్టిట్యూయెంట్ శాసన సభ ముందు పెట్టకుండా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది చెల్లదని ఆయన స్పష్టం చేశారు. కాన్‌స్టిట్యూయెంట్ శాసన సభ 1951లో ప్రారంభమై 1957లో రద్దు అయ్యింది, అందుకే ఆర్టికల్ 370(3)ని అమలు చేయటం అనేది 1951-57 మధ్యనే సాధ్యమయ్యేది, ఇప్పుడు కాదని ఆయన వాదించారు. 370 రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన అన్ని పిటిషన్లను పరిశీలించేందుకు విస్తృత బెంచ్‌ను ఏర్పాటు చేయవలసిన అవసరం లేదని సీయూ సింగ్ కోర్టుకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయటంలో నియమ, నిబంధనలను పాటించలేదని రాజీవ్ ధావన్ వాదించారు. అందుకే ఈ అంశాన్ని విస్తృత బెంచ్‌కు పంపించాలని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అధికారాలు జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని మింగివేశాయని దావన్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజీవ్ ధావన్ జమ్మూకాశ్మీర్ చిత్ర పటం చూపించగా సొలిసిటర్ జనరల్ అందుకు అభ్యంతరం చెప్పారు. రాష్ట్ర చిత్రపటాన్ని ఇక్కడ చూపించవలసిన అవసరం లేదని సొలిసిటర్ జనరల్ కోర్టుకు విన్నవించారు. ఒక రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతం స్థాయికి తగ్గించటం ఎంత వరకు సబబని ధావన్ ప్రశ్నించారు. సీనియర్ న్యాయవాది షా వేర్పాటువాదులను సమర్థించటం మంచిదా? అని ఆయన ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత న్యాయమూర్తి ఎన్‌వీ రమణ మాట్లాడుతూ ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రాన్ని రెండుగా విభజించటాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు విస్తృత బెంచ్‌ను ఏర్పాటు చేయాలా వద్దా? దానిపై తీర్పును రిజర్వు చేస్తున్నామని ప్రకటించారు.