క్రైమ్/లీగల్

లక్ష్మీపురంలో ఏటీఎం చోరీకి విఫలయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చల్లపల్లి, జనవరి 25: మండల పరిధిలోని లక్ష్మీపురం సెంటరులో ఉన్న ఓ ప్రైవేట్ ఏటీయం చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు టాటా కమ్యూనికేషన్స్ పేమెంట్ సొల్యూషన్ లిమిటెడ్‌కు చెందిన ఏటీయం మిషన్‌తో సహా చోరీ చేసేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఏటీయంకు తాళ్లు బిగించి వాహనం సహాయంతో బయటకు తీసుకు వచ్చినప్పటికీ ఏటీయం క్యాష్ బాక్స్ తెరిచే సమయంలో వచ్చిన శబ్దాలకు పక్కనే ఉన్న ఓ దుకాణ యజమాని పేరం ఆంజనేయులు నిద్రలేచి కేకలు వేయటంతో దుండగులు పరారయ్యారు. దీనిపై చల్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ వెంకట నారాయణ తెలిపారు. ఏటీయంలో రూ.4,32,400లు నగదు భద్రంగా ఉందని, గతంలోనూ ఇదే ఏటీయం సెంటరులో దుండగులు ఇటువంటి ప్రయత్నమే చేశారని కంపెనీ ప్రతినిధి లోయ వెంకట శివ శంకర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మచిలీపట్నం నుండి వచ్చిన క్లూస్ టీమ్ నేర పరిశోధనకు అవసరమైన సాక్ష్యాధారాలను సేకరించింది.