క్రైమ్/లీగల్

పంట బోదెలోకి బోల్తాపడిన ఆర్టీసీ బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైకలూరు, జనవరి 25: ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పంట బోదెలోకి బోల్తా కొట్టిన ఘటన మండల పరిధిలోని ఆలపాడు సమీపంలో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఏలూరు డిపోకు చెందిన ఏపీ 37 జడ్ 0032 నెంబరు గల ఆర్టీసీ బస్సు ఏలూర నుండి నర్సాపురం వెళుతుండగా ఈ ఘటన జరిగింది. 42 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఆలపాడు సమీపంలో అదుపు తప్పటంతో పక్కనే ఉన్న పంట కాలువలోకి బోల్తా పడింది. కాలువలోకి బోల్తాపడిన వెంటనే ప్రయాణికులంతా బయటకు వచ్చేశారు. నలుగురు ప్రయాణికులకు గాయాలు కావటంతో 108 అంబులెన్స్ ద్వారా వారిని కైకలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాదానికి కారణం డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే కారణంగా ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఘటనపై కైకలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.