క్రైమ్/లీగల్

చదువుకున్న పాఠశాలలోనే విద్యార్థి బలవన్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చల్లపల్లి, జనవరి 25: ఘంటసాల మండలం శ్రీకాకుళం జడ్పీ హైస్కూలులో పదవ తరగతి విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది. తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జడ్పీ హైస్కూలులో పదవ తరగతి చదువుతున్న అదే గ్రామానికి చెందిన తమ్మనబోయిన దీపక్ సాయి (15) శనివారం పాఠశాల తెరవక ముందే పాఠశాల ఆవరణలో ఉరికి వేలాడుతూ కనిపించాడు. శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో నైట్ ట్యూషన్‌కు వెళుతున్నానని ఇంటి నుండి బయలుదేరిన దీపక్ సాయి తెల్లవారే సరికి విగతజీవిగా మిగిలాడు. ఉదయం 7గంటల సమయంలో పాఠశాల తరగతి గదులను శుభ్రం చేసేందుకు స్వీపర్ పెసర్లంక కుమారి ఉరికి వేలాడుతున్న దీపక్ సాయి మృతదేహాన్ని చూసి నిర్ఘాంతపోయింది. విషయాన్ని సమీప పాల కేంద్రంలో పనిచేస్తున్న శ్రీనివాసరావుకు తెలపగా శ్రీనివాసరావు మృతుని తండ్రి భీమరాజుకు సమాచారం అందించాడు. పాఠశాలలోనే ఉరి వేసుకుని విద్యార్థి మృతి చెందాడన్న సమాచారం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున పాఠశాలకు చేరుకున్నారు. మృతుడి తండ్రి భీమరాజు ఫిర్యాదు మేరకు ఘంటసాల ఎఎస్‌ఐ వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.