క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు సంఘటనల్లో ఐదుగురు మృత్యువాతపడ్డారు. జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, రైలు కింద పడి ఇద్దరు తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లాలోని కొడవలూరు మండలం రాచర్లపాడు సమీపంలో 45వ నెంబర్ జాతీయ రహదారిపై శనివారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. జిల్లాలోని బిట్రగుంటకు చెందిన ఫిలోమణమ్మ(84) అనారోగ్యంతో నెల్లూరులోని ప్రభుత్వాసుపత్రిలో కొద్దిరోజులుగా చికిత్స పొందుతూ ఉంది. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం ఆమెను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. అంబులెన్స్‌లో ఫిలోమణమ్మను తీసుకొని ఆమె సోదరుడు ఆరోమ్ విక్టర్ (79), అక్క కుమార్తె పుష్పవాణి తమ స్వగ్రామానికి బయల్దేరారు. రాచర్లపాడు సమీపంలో అంబులెన్స్ ప్రమాదానికి గురై డివైడర్‌ను బలంగా ఢీకొని రహదారి పక్కన పల్టీలు కొడుతూ పడిపోయింది. ఈ ప్రమాదంలో సిలోమణమ్మ, ఆరోమ్ విక్టర్‌లతో పాటు అంబులెన్స్ డ్రైవర్ మాగంటి వినయ్‌కుమార్(21)లకు తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాల పాలైన పుష్పవాణిని చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రురాలిని ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. అతివేగంతో పాటు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. తల్లీకూతుళ్ల బలవన్మరణం: తన భర్త లేని జీవితం వృథా అని భావించిన ఓ మహిళ తన కూతురితో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలోని గూడూరు సమీపంలో చోటుచేసుకుంది. జిల్లాలోని బాలాయపల్లి మండలం గొల్లగుంటకు చెందిన దాసరి రాజ్యలక్ష్మి (33), తన కుమార్తె దాసరి కావ్య (7)తోకలిసి వెందోడు-కొండగుంట రైల్వేస్టేషన్ల మధ్య రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అంతక్రితం కొద్ది రోజుల కింద మరణించారు. ఈ బాధ తట్టుకోలేని రాజ్యలక్ష్మి శుక్రవారం రాత్రి తన కుమార్తెతో కలిసి ఇంట్లో నుండి బైటకు వచ్చేసింది. సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద తల్లీకూతుళ్లు విగతజీవులుగా పడి ఉండడాన్ని గుర్తించిన స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.