క్రైమ్/లీగల్

నేడు సుప్రీం కోర్టులో భోపాల్ గ్యాస్ కేసు విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 27: భోపాల్ గ్యాస్ బాధితులకు నష్టపరిహారానికి సంబంధించిన కేసు విచారణ మంగళవారం సుప్రీం కోర్టు చేపట్టనుంది. భోపాల్ గ్యాస్ విషాదంలో బాధితులకు అదనంగా 7,844 కోట్ల రూపాయలు చెల్లించేలా సంస్థను ఆదేశించాలంటూ పిటిషన్ దాఖలైంది. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారించనుంది. న్యాయమూర్తులు అరుణ్ మిశ్రా, ఇందిరా బెనర్జీ, వినీత్ శరణ్, ఎంఆర్ షా, ఎస్ రవింధ్ర భట్‌తో కూడిన బెంచ్ క్యూరేటివ్ పిటిషన్ విచారించనుంది. అమెరికాకు చెందిన యూనియన్ కార్బైడ్ కంపెనీ నుంచి గ్యాస్ విస్ఫోటనం సంభవించి సుమారు 3000 వేల మంది మృత్యువాత పడ్డారు. లక్షా02 మందిపై తీవ్ర ప్రభావం చూపింది. అనేక మంది పలు రకాలైన రుగ్మతలకు గురయ్యారు. 1984 డిసెంబర్ 23న సంభవించిన ఈ ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా సంచలన సృష్టించింది. ఇప్పుడా కంపెనీ డౌ కెమికల్స్ యాజమాన్యం కింద ఉంది. యూనియర్ కార్బైడ కార్పొరేషన్(యూసీసీ) నుంచి మిథైల్ ఐసోసైనేట్(ఎంఐసీ) లీక్ అయి పెను విషాదం నింపింది. యూసీసీ బాధితుల కోసం 470 యూఎస్‌డీ(రూ. 715కోట్లు) నష్టపరిహారం కింద ఇచ్చింది. మూడువేల మందిని పొట్టనబెట్టుకున్న ఎంఐసీ బతికున్న వారిపైనే తీవ్ర ప్రభావం చూపింది. విషవాయువ వల్ల శారీరక, మానసిక వైకల్యం సంభవించింది. సంఘటన జరిగి మూడు దశాబ్దాలకు పైగా అయినా భోపాల్ గ్యాస్ పీడకల వదల్లేదు. బాధితులకు అదనంగా రూ, 7,844 కోట్లు ఇచ్చేలా కంపెనీని ఆదేశించాలంటూ 2010 డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. క్యూరేటివ్ పిటిషన్ ఐదుగురు న్యాయమూర్తులో కూడిన బెంచ్ విచారించనుంది. కాగా 2010 జూన్ 7న యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన ఏడుగురు ఎగ్జిక్యూటివ్‌లను భోపాల్ కోర్టు దోషులుగా తేల్చింది. గ్యాస్ లీక్ దుర్ఘటనకు సంబంధించి ఒక్కోక్కరికి రెండేళ్ల చొప్పున జరిమానా విధించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు యూసీసీ చైర్మన్ వారెన్ ఆండర్‌సన్ విచారణకు హాజరుకాలేదు. 1992 ఫిబ్రవరి 1న భోపాల్ చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఆండర్‌సన్‌ను పరారీలో ఉన్న నిందితుడిగా ప్రకటించింది. 1992, 2009లో రెండు పర్యాయాలు భోపాల్ కోర్టులు అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశాయి. 2014 సెప్టెంబర్‌లో వారెన్ ఆండర్‌సన్ మృతి చెందాడు.