క్రైమ్/లీగల్

హాజీపూర్ కేసు తీర్పు 6కు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ లీగల్, జనవరి 27: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు బాలికల హత్యాచారం కేసు తీర్పును నల్లగొండ ఫోక్సో ప్రత్యేక కోర్టు ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. జడ్జి ఎస్.వీ.వీ. నాథ్‌రెడ్డి సోమవారం కేసు విచారణ సందర్భంగా తీర్పు కాపీ సిద్ధం కాకపోవడంతో తుది తీర్పును ఫిబ్రవరి 6కు వాయిదా వేశారు. పోలీసులు నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని కోర్టుకు హాజరుపరిచి తిరిగి జైలుకు తరలించారు.