క్రైమ్/లీగల్

భార్యకు ఫోన్‌లో ట్రిపుల్ తలాఖ్ చెప్పిన భర్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బండ (యూపీ), జనవరి 29: ట్రిపుల్ తలాఖ్‌ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కఠినతరమైన చట్టం తీసుకుని వచ్చినా, ట్రిపుల్ తలాఖ్‌లు ఆగడం లేదు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో ఒక వ్యక్తి తన భార్యకు ఫోన్‌లో ట్రిపుల్ తలాఖ్ చెప్పాడు. అంతేకాకుండా సదరు మహిళ తన మరిదితో లైంగికంగా వేధింపులకు గురవుతున్నట్లు పోలీసులు బుధవారం తెలిపారు. గత ఏడాది ఆమెకు వివాహం జరిగింది. ఆమె ఫిర్యాదు మేరకు భర్తతో పాటు మరిది మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు కోత్వాలీ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రవీంద్ర శ్రీవాత్సవ తెలిపారు. ఈ నెల 17న ఫోన్‌లో ట్రిపుల్ తలాఖ్ చెప్పిన భర్తను అరెస్టు చేసేందుకు పోలీసు బృందాలు తిరుగుతున్నాయని ఆయన చెప్పారు. లైంగిక వేధింపులే కాకుండా వరకట్న వేధింపులు కూడా ఎక్కువ అయ్యాయని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఇన్‌స్పెక్టర్ శ్రీవాత్సవ తెలిపారు.