క్రైమ్/లీగల్

అఫిడవిట్ దాఖలు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 29: దేశ రాజధాని ఢిల్లీలో నిర్మిస్తున్న హౌసింగ్ కాంప్లెక్స్ పనులు నిలిపివేస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్‌జీటీ) ఇచ్చిన ఆదేశాలకు సుప్రీం కోర్టు పక్కబెట్టింది. ఢిల్లీ యూనివర్శిటీ క్యాంపస్‌ను ఆనుకుని హౌసింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. అయితే పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాన్న ఎన్‌జీటీ స్టేటస్ కో విధించింది. కేంద్ర పర్యావరణ నియంత్రణ బోర్డు ప్రతినిధుల సంయుక్త కమిటీ, కేంద్ర అటవీ, పర్యావరణ, ఐఐటీ ఢిల్లీ డేటా అందజేయాలని నిర్వాహకులను ఈనెల 8న ట్రిబ్యునల్ ఆదేశించింది. న్యాయమూర్తులు ఆర్ బానుమతి, ఏఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనం ఎన్‌జీటీ ఆదేశాలతో విభేదించింది. దీనిపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్‌జీటీ బెంచ్ ఆదేశించింది. నిర్మాణలపై యథాతధ ఆదేశాలు ఇవ్వకానికి సంబంధించిన అన్ని ధృవీకరణ పత్రాలు అందజేయాలని కోరింది. యంగ్ బిల్డర్స్(ప్రైవేట్) లిమిటెడ్ తరఫున న్యాయవాది కోర్టును హాజరయ్యారు. ఎన్‌జీటీ ఆదేశాలను న్యాయవాది సవాల్ చేశారు. హౌసింగ్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వడాన్ని ఢిల్లీ యూనివర్సిటీ ఎన్‌జీటీలో సవాల్ చేసింది. దీంతో ఎన్‌జీటీ స్టేటస్ కో ఆదేశాలు ఇచ్చింది.