క్రైమ్/లీగల్

తీర్పు రిజర్వ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నిర్భయ హంతకుల మరణ శిక్షపై స్టే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అభ్యర్థనపై ఢిల్లీ హైకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. సంబంధిత పార్టీల వాదోపవాదాలు ముగిసిన తర్వా త న్యాయమూర్తి సురేష్ ఖాయర్ దీని పై తన ఉత్తర్వులు జారీ చేస్తారు. నిర్భ య దోషులు కేసును ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని, చట్టాన్ని వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని సొలిసిటర్ జనరల్ కోర్టుకు విన్నవించారు. నిర్భయపై అత్యాచారానికి పాల్పడి, హ త్య చేసిన నిందితులకు ఉరి శిక్ష పడిన సంగతి తెలిసిందే. అయితే దోషులు ఉరి శిక్ష నుంచి తప్పించుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. జాప్యం చేయడానికి దోషులు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఒకరేమో ఆ ఘటన జరిగినప్పుడు తాను మైనర్‌ను కాబట్టి, ఆ చట్టం ప్రకారమే వాదన వినాలని కోరారన్నారు. మరొకరేమో రాష్టప్రతి రాంనాథ్ కోవింద్ వద్ద క్షమాబిక్ష పిటిషన్ దాఖలు చేశారని ఆయన తెలిపారు. మరొక దోషి నివారణ, క్షమాబిక్ష పిటిషన్ దాఖలు చేయలేదన్నారు. ఉద్దేశపూర్వకంగా, అంచనా ప్రకారమే పిటిషన్ దాఖలు చేయలేదని ఆయన తెలిపారు. నిర్భయ దోషులు న్యాయ వ్యవస్థతో ఆటలాడుకుంటున్నారని, జాతి ఓపికను పరీక్షస్తున్నారని ఆయన అన్నారు. చట్ట ప్రకారం న్యాయస్థానం ఇచ్చిన తీర్పును దెబ్బతీస్తున్నారని ఆయన విమర్శించారు. దోషులు అక్షయ్ సింగ్ (31),
వినయ్ శర్మ (26), పవన్ (25) తరఫు న్యాయవాది మాట్లాడుతూ ఉరి శిక్షను ఉపసంహరించుకోవాలని కోరారు.
2012 సంవత్సరం డిసెంబర్ 16 రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు అంటే 17వ తేదీ వరకు బస్సులో పారామెడికల్ విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. 16 రాత్రి బస్సు కోసం వేచి చూస్తున్న విద్యార్థిని బస్సులో ఎక్కగానే ఎక్కడా ఆపకుండా రోడ్డుపై బస్సును తిప్పుతూనే దుండగులు అత్యాచారానికి పాల్పడి, ఆ తర్వాత బస్సులో నుంచి తోసేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని పోలీసులు గుర్తించి అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయ స్థానం ఉరి శిక్ష ఖరారు చేసింది. తీవ్రంగా గాయపడిన ఆమె ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు శతవిధాలా ప్రయత్నించారు. అంతేకాకుండా మెరుగైన వైద్యం కోసం ఆమెను సింగపూర్‌లోని వౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ నిర్భయ డిసెంబర్ 29వ తేదీన తుది శ్వాస విడిచారు. అత్యాచారానికి పాల్పడిన ఆరుగురిలో నిందితుడు రాం సింగ్ కేసు విచారణ సమయంలోనే భయపడి జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడు మైనర్ కావడంతో బాల నేరస్థుల జైలులో ఉన్నాడు. యావత్ దేశ ప్రజలు నిందితులకు శిక్ష ఎప్పుడు పడుతుందా? అని ఎదురు చూస్తుండగా, ఉరి శిక్ష ఖరారైనా, పలు కేసులతో జాప్యం చేస్తున్నారని సొలిసిటర్ జనరల్ కోర్టుకు విన్నవించారు.