క్రైమ్/లీగల్

పుల్వామా దాడి నిందితుడు జైష్-ఏ-అహ్మద్ ఉగ్రవాది అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ/శ్రీనగర్: పోలీసులపై కాల్పులు జరుపుతూ పారిపోవడానికి ప్రయత్నించిన పుల్వామా దాడి నిందితుడు, జైష్-ఏ-మహ్మద్ తీవ్రవాది సమీర్ దార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో అనేక అంశాలు వెలుగు చూశాయి. పుల్వామాలో మానవ బాంబు అమర్చుకుని ఆత్మాహుతి చేసుకున్న ఆదిల్ దార్‌కు సమీర్ దార్ సోదరుడు. గత ఏడాది ఫిబ్రవరిలో ఆదిల్ దార్ మానవ బాంబు పేల్చుకోవడంతో పేలిన బాంబుతో 40 మంది సైనికులు మృత్యువాత పడిన అత్యంత విషాదకరమైన ఘటన గురించి తెలిసిందే.
కాగా రెండు రోజుల క్రితం అంటే శుక్రవారం పుల్వామా జిల్లాలోని కాక్‌పొరా, నగ్రోత ప్రాంతం నుంచి ఉగ్రవాది సమీర్ దార్ మరి కొంత మంది ఉగ్రవాదులు పారిపోతుండగా పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఉగ్రవాదులు కాల్పులు జరపడం ప్రారంభించారు. పోలీసులు ఎదురు కాల్పులు జరుపుతూనే సమీర్ దార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు జరిపిన విచారణలో సమీర్‌దార్ అనేక విషయాలు చెప్పాడు.
జమ్మూ-కాశ్మీర్‌లో అశాంతి సృష్టించేందుకు తాము గత ఏడాది డిసెంబర్‌లో తీవ్రవాదుల బృందాన్ని వదిలినట్లు చెప్పారు. అయితే ప్రస్తుతం వారు ఎక్కడ ఉన్నారో తనకు తెలియదన్నారు. వారి వెంట అత్యాధునిక ఆయుధాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఉగ్రవాదుల వద్ద అత్యాధునిక ఎం-4 కార్భన్ ఆయుధాలు ఉన్నట్లు చెప్పారు. ఈ ఆయుధాలు ఎక్కువగా పాకిస్తాన్‌లోని ప్రత్యేక సైన్యం వినియోగిస్తుందని పోలీసులు తెలిపారు.