క్రైమ్/లీగల్

పసికందులు చనిపోతున్నా చలించరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నోళ్లు తెరుచుకొన్న, నిర్లక్ష్యంగా వదిలివేసిన బోర్లలో పడి చిన్నారులు చనిపోతున్న ఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. 2010 సంవత్సరంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి ఎటువంటి చర్యలు సంబంధిత అధికారులు తీసుకోకపోవడం వల్లే చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారనీ.. తక్షణమే కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ విషయంలో ఎలాంటి రక్షణ చర్యలు తీసుకొంటున్నారో తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
కోర్టు ఆదేశాలు పాటించకుండా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే తరచు బోర్లలో చిన్నారులు పడి ప్రాణాలు కోల్పోతున్నారని.. దీనిపై ఆయా ప్రభుత్వాల నుంచి వివరణ కోరాలని డిమాండ్ చేస్తూ న్యాయవాది జీఎస్ మణి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్ మిశ్రా, ఎంఆర్ షా సుముఖత వ్యక్తం చేశారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తక్షణమే ఎలాంటి చర్యలు తీసుకొంటున్నారో సుప్రీంకోర్టుకు తెలియజేయాలని ధర్మాసనం ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. తక్షణమే సుప్రీం నోటీసులకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేసింది. తీసిన బోర్లను నిర్లక్ష్యంగా వదిలివేయడం కారణంగా అమాయక పిల్లలు వాటిలో పడి చనిపోవడం వల్ల బాధిత కుటుంబాలకు తీరని విషాదంలో మునిగిపోతున్నారని కోర్టుకు వివరించారు. వీటికి సంబంధించి కోర్టుకు వివరాలు వెల్లడిస్తూ.. ఓపెన్ బోరులో ఓ చిన్నారి పడిపోవడంతో ఆర్మీ బృందం సహాయ చర్యలు చేపట్టిన మొట్టమొదటి ఘటన 2006లో వెలుగులోకి రాగా గత సంవత్సరం అక్టోబర్ నెలలో సైతం తమిళనాడులోని ఓ బోరుబావిలో పడి మూడేళ్ల చిన్నారి అందులో పడి అశువులు బాసాడన్న విషయాన్ని న్యాయవాది మణి కోర్టుకు వివరించారు. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా తరచు జరుగుతూనే ఉన్నాయనీ.. సంబంధిత యంత్రాంగం తగు చర్యలు తీసుకోకపోవడం వల్లే అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారన్న విషయాన్ని మణి సుప్రీం ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. వాదోపవాదాలు విన్న సుప్రీం ధర్మాసనం.. తక్షణమే కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ విషయమై ఎలాంటి చర్యలు తీసుకొంటున్నారో ఒక నోట్ ద్వారా సుప్రీంకోర్టుకు వెల్లడించాలని ధర్మాసనం ఆదేశించింది.