క్రైమ్/లీగల్

అధ్యాపకురాలిపై పెట్రోల్ దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగ్‌పూర్: మహారాష్టలోని వార్ధా జిల్లాలో ఓ ఘోరం చోటుచేసుకుంది. 25 ఏళ్ల అధ్యాపకురాలిపై గుర్తుతెలియని వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. నలభై శాతం కాలిన గాయాలతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. అనిత పిసుడ్డే(25)పై సోమవారం ఉదయం 7.15 గంటలకు పెట్రోల్ దాడి జరిగింది. దరోడా గ్రామానికి చెందిన అనిత వార్ధాజిల్లాలోని హింగ్నాఘాట్ కాలేజీ వెళ్లేందుకు బస్సులో ఉన్నారు. ఆ సమయంలో వికేస్ నగ్రాలే(27) దుండగుడు ఆకస్మాతుగా వచ్చి అధ్యాపకురాలిపై పెట్రోల్ చల్లి నిప్పు అంటించాడు. ద్విచక్రవాహనంపై దుండగుడు పారిపోయాడు. సంఘటన చూసి హతాశులైన తోటి ప్రయాణికులు అనితపై నీళ్లు చల్లి హుటాహుటిన సమీపంలోని పీహెచ్‌సీకి తరలించారు. ఆమె శరీరం 40 శాతం కాలిపోయింది. దీంతో మెరుగైన వైద్య కోసం నాగ్‌పూర్‌లోని ఆరెంజ్ సిటీ ఆసుపత్రికి తరలించారు. అనిత పరిస్థితి విషమంగానే ఉంది. నిందితుడు వికేస్ బాధితురాలికి పరిచయస్తుడేనని పోలీసు ఇన్‌స్పెక్టర్ సత్యవీర్ బండివార్ వెల్లడించారు. రెండేళ్ల నుంచి అతడిని దూరంగా పెట్టింది. దీంతో కోపం పెంచుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆయన చెప్పారు. ఇలా ఉండగా అనిత పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. సోమవారం సాయంత్రం ఆమె ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్ విడుదల చేశారు. ‘తల, ముఖం, ఎడమ చేయి, వీపుభాగం, మెడపై తీవ్ర గాయాలున్నాయి. 40 శాతం శరీరం కాలింది’అని తెలిపారు. అధ్యాపకురాలిపై ఘాతుకానికి పాల్పడ్న వికేస్‌ను తకల్‌ఘాట్ గ్రామంలో పట్టుకున్నారు. అతడిపై ఐపీసీలోని సెక్షన్ 307, 326 కింద కేసు నమోదు చేసినట్టు వార్ధా ఎస్పీ బసవరాజ్ తేలి చెప్పారు. బాధితురాలికి వికేస్ స్నేహితుడేనని బండివార్ వెల్లడించారు. నిందితుడిది కూడా దరోడా గ్రామమేని తెలిపారు. వివాహితుడైన వికేస్‌కు ఏడు నెలల కొడుకు ఉన్నాడు. బలార్షాలో ఓ కంపెనీలో పనిచేస్తున్నట్టు పోలీసులు చెప్పారు.