క్రైమ్/లీగల్

‘గాంధీ’లో నకిలీ వైద్యుడి గుట్టురట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, ఫిబ్రవరి 6: గాంధీ ఆసుపత్రిలో ఇప్పటికే కరోనా వైరస్ కలకలం రేగుతుండగా, దానికి తోడు నకిలీ డాక్టర్ వ్యవహారం తోడైంది. ఇకేముందీ రోగులు, సహాయకుల ఆందోళన మరింత రెట్టింపయ్యింది. గురువారం నకిలీ డాక్టర్ వ్యవహారం గుట్టురట్టు కావటంతో చిలుకలగూడ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, గాంధీ వైద్యుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. రొటీన్‌గా క్యాంటీన్‌లో భోజనం చేసేందుకు వెళ్లిన వైద్యులకు అక్కడ డా.సుప్రజిత్ పాండా అనే కొత్త వైద్యుడు కన్పించటంతో పలకరించి, మీరు ఏ విభాగంలో పని చేస్తున్నారని ప్రశ్నించారు. తాను జనరల్ మెడిసిన్ విభాగంలో పని చేస్తున్నాని తెలిపాడు. మేము కూడా అందులోనే పని చేస్తున్నాము మీరు ఎప్పుడు కనిపించలేదని ఐడీ కార్డు చూపించమని కోరడంతో నకిలీ డాక్టర్ నీళ్లు నమిలాడు. దీంతో వైద్యులు వెంటనే చిలకలగూడా పోలీసులకు సమాచారం ఇవ్వటంతో రంగంలో దిగిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా, అతను నకిలీ డాక్టర్‌గా తేలింది. నిందితుని వద్ద వద్ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జారీ చేసినట్లు, ఓ గుర్తింపు కార్డు ఉందని అందులో డా. సుభ్రజిత్ పాండా ఎంఎస్ ఫెలోషిప్ ఇన్ కార్డియాలజీ కార్డియక్ సర్జన్ అని ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతను ఏ ఉద్ధేశ్యంతో నకిలీ వైద్యుని అవతారం ఎత్తి ఉంటాడనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. తాను డాక్టర్‌నని ఎవరైనా అమ్మాయిని నమ్మించి పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో ఇలా చేసి ఉంటాడా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిందితుడు ఉప్పల్ సాయినగర్‌లోని గాంధీ విగ్రహాం సమీపంలో గుండె సంబంధిత వ్యాధుల చికిత్స చేస్తానని ఓ క్లీనిక్‌ను నడుపుతున్నట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని ఇన్‌స్పెక్టర్ బాలగంగిరెడ్డి తెలిపారు. నిందితుడి పై ఐపీసీ సెక్షన్‌లతో పాటు తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్ రిజస్రేంటషన్ ఆక్ట్ కింద కేసులు నమోదు చేసి విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి డాక్టర్లు ఇంకా ఎవరైనా ఉన్నార అనే విషయం పైనా కూడా ఆరా తీస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
గాంధీ ఆసుపత్రిలో విధులు నిర్వర్తించే వైద్యులు, ఇతర సిబ్బంది మొత్తం కూడా శుక్రవారం నుంచి ఐడీ కార్డు చూపాలని, క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతించేలా ఆదేశాలిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.శ్రావణ్‌కుమార్ తెలిపారు.
*చిత్రం...పోలీసుల అదుపులో ఉన్న నకిలీ వైద్యుడు