క్రైమ్/లీగల్

వారెంట్లు మళ్లీ జారీ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నిర్భయ గ్యాంగ్‌రేప్, హత్య కేసులో నలుగురు ముద్దాయిలకు విధించిన ఉరిశిక్షను అమలు చేయడానికి మళ్లీ వారంట్లు జారీ చేయాలని కోరుతూ తీహార్ జైలు అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌కు రేపటిలోగా సమాధానం ఇవ్వాలని ఢిల్లీలోని ఒక కోర్టు గురువారం సదరు ముద్దాయిలను ఆదేశించింది. తీహార్ జైలు అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారంలోగా సమాధానం ఇవ్వాలని అదనపు సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రాణా ఈ కేసులోని ముద్దాయిలను ఆదేశించారు. నలుగురు ముద్దాయిలు- ముకేశ్ కుమార్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ కుమార్ శర్మ (26), అక్షయ్ కుమార్ (31)ల ఉరిశిక్ష అమలును తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు వాయిదా వేస్తూ ట్రయల్ కోర్టు జనవరి 31వ తేదీన ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నలుగురు ముద్దాయిలు ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. రాష్టప్రతి ఇప్పటికే వీరిలోని ముగ్గురు ముద్దాయిల క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించారని, నలుగురు ముద్దాయిల్లో ఏ ఒక్కరి పిటిషన్ ఇప్పుడు ఏ కోర్టులోనూ పెండింగ్‌లో లేదని తీహార్ జైలు అధికారులు తమ పిటిషన్‌లో వివరించారు. పవన్ ఇప్పటి వరకు క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయలేదు. ఉరిశిక్ష పడిన ముద్దాయికి క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసుకోవడం అనేది న్యాయపరంగా ఉపశమనం పొందేందుకు ఉన్న చివరి అవకాశం. పవన్‌కు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశం కూడా ఉంది. ముద్దాయిలు న్యాయపరంగా తమకు ఉపశమనం కలిగించడానికి ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవాలనుకుంటే వారం రోజుల్లోగా ఉపయోగించుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఫిబ్రవరి అయిదో తేదీన ముద్దాయిలకు జారీ చేసిన ఆదేశాలను కూడా తీహార్ జైలు అధికారులు గురువారం కోర్టుకు వివరించారు. ఢిల్లీ హైకోర్టు ముద్దాయిలకు ఇచ్చిన వారం రోజుల గడువును దృష్టిలో పెట్టుకొని, ముద్దాయిలు పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముకేశ్, అక్షయ్‌ల ఉరిశిక్షను అమలు చేయడానికి నిర్దిష్టమయిన తేది, సమయాన్ని నిర్ణయించాలని తీహార్ జైలు అధికారులు తమ పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించారు.