క్రైమ్/లీగల్

స్కూల్ బస్సు బోల్తా : 22మందికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురిచేడు, ఫిబ్రవరి 8: విరామ కాలంలో విహార యాత్రకు బయలుదేరిన పాఠశాల సిబ్బందికి రోడ్డు ప్రమాదం విషదాన్ని నింపింది. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పోట్లపాడు గ్రామ సమీపంలో శనివారం ఉదయం గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన శ్రీ చైతన్య స్కూల్ బస్సు బోల్తాపడి 22 మంది గాయపడ్డారు. వీరిలో 7 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. బాధితుల కథనం ప్రకారం గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి, పిడుగురాళ్ల, అమరావతి, నరసరావుపేట, మాచర్ల పట్టణాలలోని శ్రీ చైతన్య పాఠశాలలో పనిచేసే సిబ్బంది శని, ఆదివారాలు సెలవు కావటంతో విహార యాత్రకు బయలు దేరారు. వేరువేరు ప్రాంతాలలో ఉన్న వీరంత శనివారం ఉదయం వినుకొండ చేరారు. అక్కడ శ్రీచైతన్య పాఠశాలకు చెందిన సుమారు 40 సిబ్బంది వారి పిల్లలతో ప్రకాశం జిల్లాలోని పర్యాటక కేంద్రామైన భైరవకోనకు బయలుదేరారు. బస్సు ఉదయం 10 గంటల సమయంలో పొట్టపాడు సమీపంలో ఎదురుగా వస్తున్న అటోను తప్పించబోయి వేగాన్ని అదుపు చేయలేక బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే అదారిన వెళ్లే ప్రజలు, రైతులు గాయపడిన వారికి సహాయపడి 108కి సమాచారం అందించారు. సమీపంలోని కురిచేడు ప్రాథమిక అరోగ్య కేంద్రానికి తరలించారు. తీవ్ర గాయాలైన వారికి వైద్యం అందించి వినుకొండ, నరసరావుపేట వైద్యశాలలకు తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని డాక్టర్లు స్పష్టం చేశారు.