క్రైమ్/లీగల్

బస్సులో మంటలు: పది మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 9: ఒడిశాలో ఆదివారం జరిగిన ఘోర దుర్ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. 11 కేవీ విద్యుత్ వైర్లకు బస్సు తగలడంతో షార్ట్‌సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకొంది. గంజాం జిల్లా గొలంతర ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో పది మంది మరణించగా, కనీసం 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బరంపూర్ సదర్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి జయంత్ కుమార్ మహాపాత్రో కథనం మేరకు.. పెళ్లి సంబంధం మాట్లాడుకోవడానికి జంగల్‌పాడు నుంచి చికరాడకు 47 మంది బస్సులో వెళ్తున్నారు. ఈ క్రమం లో బస్సు మందరాజ్‌పూర్‌కు వచ్చే సరికి మోటార్‌సైకిల్‌ను తప్పించే క్రమంలో డ్రైవర్ వాహనాన్ని ఎడమవైపుకు మళ్లించాడు. దీంతో 11 కేవీ విద్యుత్ వైర్లు బస్సు ను తగలడంతో షార్ట్‌సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. దీంతో బస్సు ఉన్న ప్రయాణికుల్లో పది మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మిగిలినవారు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలియగానే బరంపురం, గొళంత్ర నుంచి పోలీసులు, అగ్నిమాపక సిబ్బం ది ఘటనాస్థలికి చేరుకుని
సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను బరంపురంలోని ఎంకెసీజె మెడికల్ కళాశాల ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలు, విద్యుత్ షాక్ కారణంగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉం దని పోలీసులు తెలిపారు. జుంగల్‌పాడు, మంద్రాజ్‌పూ ర్ తదితర సరిహద్దు గ్రామాలలో తెలుగువారు ఎక్కువగా ఉండటంతో ప్రమాదం గురించి తెలియగానే ఇచ్ఛాపురం ప్రజలు ఆందోళనకు గురయ్యారు. తమ బంధువులు ఎవరైనా ఉన్నారేమోనని ఆరా తీశారు. గొళంత్ర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సీఎం నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి
ఈ ఘోర దుర్ఘటన పట్ల ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తక్షణ సహాయంగా రెండు లక్షల రూపాయిల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు ఉచిత వైద్య సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. ఘటనకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పద్మనాభ బెహరా స్పష్టం చేశారు. కేంద్ర పెట్రోలియం, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బస్సు ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ క్షతగాత్రులు త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
*చిత్రం... బస్సు ప్రమాద ఘటనా స్థలంలో మృతి చెందిన ప్రయాణికులు, క్షతగాత్రులు