క్రైమ్/లీగల్

‘కమ్యూనిటీ కిచెన్’ ఏర్పాటు ఏమైంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ‘కమ్యూనిటీ కిచెన్’ సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర, రాష్ట్రాలు అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశంలో పలు వర్గాలకు బలవర్ధక ఆహారం లభించడం లేదని, కమ్యూనిటీ కిచెన్‌లు ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)ను న్యాయమూర్తులు ఎన్‌వీ రమణ, అజయ్ రస్తోగి, వీ రామసుబ్రహ్మణ్యన్‌తో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం విచారించింది. పిల్‌పై అఫిడవిట్లు దాఖలు చేయాలన్నా నిర్లక్ష్యం వహించినందుకు కేంద్ర, రాష్ట్రాలకు ఐదు లక్షల రూపాయల జరిమానాను కోర్టు విధించింది. దీనిపై 24 గంటల్లో అఫిడవిట్లు దాఖలు చేసే పక్షంలో లక్ష రూపాయలు, తమ ఆదేశాలను పట్టించుకోండా ఉంటే 5 లక్షల రూపాయల జరిమాన తప్పదని బెంచ్ హెచ్చరించింది. పంజాబ్, నాగాలాండ్, కర్నాటక, ఉత్తరాఖండ్, జార్ఖండ్ అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలైన అండమాన్-నికోబర్ మాత్రం తమ అఫిడవిట్‌లు దాఖలు చేశాయి. మిగతా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా కనిపించలేదని పిల్ దాఖలు చేసిన అరుణ్ ధావన్ ఆరోపించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది అషిమా మండ్లా మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఐదు నెలల క్రితం ఆదేశాలు ఇచ్చినా స్పందనలేదని వాపోయారు. కేవలం ఐదు రాష్ల్రాటు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం మాత్రమే అఫిడవిట్లు దాఖలు చేశాయని ఆమె అన్నారు. ఐదేళ్ల వయసుకంటే చిన్న పిల్లలు 69 శాతం మంది దేశంలో పౌష్టికాహార లోపంతో బాధపడుతూ చనిపోతున్నారని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. బాలల మరణాలను అరికట్టడానికి దేశ వ్యాప్తంగా కమ్యూనిటీ కిచెన్‌లు ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది కోరారు. అడిషనల్ సొలిసిటర్ జనరల్ మాధవి దివాన్ కేంద్ర ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించారు. దీనిపై వివరణ ఇవ్వడానికి కేంద్రానికి మరికొంత సమయం కావాలని ఆమె అభ్యర్థించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కేసు తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది. ఆ తేదీ నాటికి అఫిడవిట్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్రాలకు బెంచ్ ఆదేశించింది. ప్రజల ఆకలిని తీర్చడానికి, పౌష్టికాహారం అందజేయడానికి వీలుగా కమ్యూనిటీ కిచెన్‌లు ఏర్పాటుకు సంబంధించి గత ఏడాది అక్టోబర్ 18న సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. ఆహార సమస్యను తీర్చడానికి ఈ తరహా కేంద్రాలు అవసరమని, దీనిపై మార్గదర్శకాలు రూపొందించేందుకు అభిప్రాయలు తెలపాలని కోర్టు కోరింది. కడుపునిండా ఆహారం, పౌష్టికాహారం అందించడం కూడా ప్రాధమిక హక్కుల కిందకే వస్తుందని పిటిషనర్ స్పష్టం చేశారు. ప్రజల ఆహార సమస్యను పరిష్కరించేందుకు ‘నేషనల్ ఫుడ్ గ్రిడ్’ను ఏర్పాటు చేయాలని, ఈమేరకు కేంద్రను ఆదేశించాలని అరుణ్ ధావన్‌తోపాటు ఇషాన్ ధావన్, కుంజాన సింగ్ సుప్రీం కోర్టులో పిటిషన్లు వేశారు. ప్రజాపౌర పంపిణీ వ్యవస్థ కాకుండా ఓ ప్రత్యేక గ్రిడ్ ఉండాలని వారు కోరారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తారాఖండ్, ఒడిశా, జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లో స్వల్ప ధరలకే భోజన సదుపాయం కల్పిస్తున్నారని పిటిషనర్లు తెలిపారు. ఆ తరహాలోనే మరిన్ని కిచెన్‌లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.
సూప్ కిచెన్, మీల్ సెంటర్, ఫుడ్ కిచెన్ లేదా కమ్యూనిటీ కిచెన్‌ను ఏర్పాటు చేసి ప్రజల ఆకలి తీర్చాలని బెంచ్‌ను కోరారు.