క్రైమ్/లీగల్

నెత్తురోడిన రహదారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిరంగిపురం, ఫిబ్రవరి 10: గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామ శివారులో సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామ శివారులో గుంటూరు-కర్నూలు రహదారిపై ప్రయాణికులతో వస్తున్న ఆటోను మినీలారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యడ్లపాడు మండలం పుట్టకోట గ్రామానికి చెందిన కాకాని రమాదేవి (35), ఆమె కుమారుడు, కుమార్తె బాల మణికంఠ (5), యశశ్విని (11 నెలలు), సాతులూరు గ్రామానికి చెందిన కొండరాతి అశోక్ (38), నాదెండ్ల మండలం చెందారం గ్రామానికి చెందిన ఆవుల యువరాజు (24) అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉండటం విషాదం. వీరిలో రమాదేవి తన
భర్తతో కలిసి నర్సరావుపేటలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి స్వస్థలానికి బైకుపై వస్తుండగా, వర్షం పడుతుండటంతో భార్య, ఇద్దరు పిల్లలను వర్షంలో తడుస్తున్నారన్న కారణంగా జొన్నలగడ్డ గ్రామంలో భర్త బ్రహ్మయ్య ఆటో ఎక్కించాడు. ఈ ఆటోలో ఎక్కడం వల్ల ప్రమాదానికి గురై వారంతా అక్కడికక్కడే మృతిచెందారు. కాగా ఈ ప్రమాదంలో మృతిచెందిన కొండరాతి అశోక్ గుంటూరులో విద్యుత్ శాఖలో పనిచేస్తూ విధులకు హాజరయ్యేందుకు బయలుదేరి మృత్యువాత పడ్డాడు. మిగిలిన మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నర్సరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలాగే గాయపడిన ఇద్దరిని కూడా చికిత్స నిమిత్తం నర్సరావుపేట ప్రభుత్వసుపత్రికి తరలించారు. నర్సరావుపేట డిఎస్‌పి వీరారెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ సురేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

*చిత్రం...ప్రమాదంలో నుజ్జనుజ్జయిన ఆటో, మృతదేహాలు