క్రైమ్/లీగల్

ప్రేమోన్మాది ఘాతుకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: తనను ప్రేమించడం లేదంటూ ఓ యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన కరీంనగర్‌లో సోమవారం సంచలనం సృష్టించింది. కొద్దిరోజుల క్రితం నగరం నడిబొడ్డున ప్రేమించడం లేదనే కోపంతో గొంతు కోసి యువతిని హత్య చేసిన సంఘటన మరువకముందే నగరంలో మరో దుస్సంఘటన చోటుచేసుకుంది. కరీంనగర్‌లోని విద్యానగర్‌కు చెందిన ఇంటర్ చదువుతున్న బాలిక ముత్త రాధిక (16) తన ప్రేమను అంగీకరించడం లేదనే కోపంతో ఓ ప్రేమోన్మాది సోమవారం సాయంత్రం ఆమె ఇంటిలో గొంతు కోసి చంపిన సంఘటన సంచలనం రేపింది. విద్యానగర్‌లోని పద్మావతి ఫంక్షన్ హాలు వెనుకభాగంలో ఉన్న రాధిక ఇంటిలో ఆమెను దుండగుడు దారుణంగా హతమార్చాడు. రాధిక తల్లిదండ్రులు రోజు కూలీలుగా పనిచేస్తున్నారు. సాయంత్రం వారి ఇంటికి వచ్చి చూసేసరికి రక్తపు మడుగులో కుమార్తె పడి ఉండడం చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ క్రమంలో పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. తమ కుమార్తెను ప్రేమించమని ఇద్దరు వెంటపడేవారని, వారిలో ఎవరో ఒకరు ఈ అఘాయత్యాని కి పాల్పడి ఉంటారని మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు. అయితే ఈ ఘాతుకానికి దుండగుడు ఎందుకు పాల్పడ్డాడు, కేవలం ప్రేమ విషయమా? లేక వేరే అంశాలు ఇందులో ఏమన్నా ముడిపడి ఉన్నాయా అనే కోణాల్లో విచారణ చేపట్టారు. మరోవైపు పోలీస్ బృందాలుగా ఏర్పడి దుండగుడిని గుర్తించడానికి దర్యాప్తు చేస్తున్నారు.

*చిత్రం...దారుణ హత్యకు గురైన రాధిక