క్రైమ్/లీగల్

పంట బోదెలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చల్లపల్లి, ఫిబ్రవరి 10: విజయవాడ నుండి కరకట్ట మీదుగా అవనిగడ్డ వస్తున్న ఆర్టీసీ బస్సు మార్గ మధ్యలో మండల పరిధిలోని మేకావారిపాలెం సమీపంలో అదుపు తప్పి బోదెలోకి ఒరగడంతో పెను ప్రమాదం తప్పింది. 40 మంది ప్రయాణీకులు ఉన్న ఆర్టీసీ బస్సు ముందు ఉన్న చెరకు బండ్లను తప్పించే క్రమంలో అదుపు తప్పింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణీకులంతా సురక్షితంగా బయటపడ్డారు. బస్సు అదుపు తప్పే క్రమంలో లోపల ఉన్న ప్రయాణీకులు భయంతో కేకలు పెట్టడంతో స్థానికులు వెంటనే బస్సు వద్దకు చేరుకుని ప్రయాణీకులను దించి వేశారు. బోదెలోకి ఒరిగిపోయిన బస్సును క్రేన్, ట్రాక్టర్ల సహాయంతో బయటకు తీశారు.