క్రైమ్/లీగల్

‘దిశ’ స్టేషన్‌లో ఎమ్మెల్యే భవాని ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: మహిళలపై వేధింపులు, అకృత్యాల నిరోధానికి రాష్ట్రంలోనే ప్రథమంగా ముఖ్యమంత్రి ప్రారంభించిన రాజమహేంద్రవరం దిశ పోలీసు స్టేషన్‌లో ఒక మహిళా ఎమ్మెల్యే ఫిర్యాదుచేశారు. అసెంబ్లీలో తాను చేసిన ప్రసంగాన్ని అవహేళన చేస్తూ తన ఫోటోలతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిపై చర్య తీసుకోవాలని కోరుతూ నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని (టీడీపీ) బుధవారం ఈ ఫిర్యాదుచేశారు. దిశ చట్టం అమలుకు సంబంధించిన ఏర్పాట్లలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పోలీసు స్టేషన్లు ప్రారంభించిన సంగతి విదితమే. ఇందులో భాగంగా తొలి స్టేషన్‌ను ముఖ్యమంత్రి శనివారం రాజమహేంద్రవరంలో ప్రారంభించారు. గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన అసెంబ్లీ సమావేశాల్లో మద్యం బ్రాండ్ల గురించి తాను చేసిన ప్రసంగంపై కొంతమంది సోషల్ మీడియలో తన ఫొటోలు పెట్టి బయటకు చెప్పుకోలేని విధంగా కామెంట్లు చేశారని, సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆ మరుసటి రోజే అసెంబ్లీ స్పీకర్‌కు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటి వరకు సదరు వ్యక్తులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంటూ, తనపై కామెంట్లు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని రాజమహేంద్రవరంలో నూతనంగా ఏర్పాటుచేసిన దిశ మహిళా పోలీసు స్టేషన్‌లో ఎమ్మెల్యే భవాని డీఎస్పీ శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదుచేశారు. ఎమ్మెల్యే భవానీపై పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరానికి చెందిన అను రాజేశ్వరి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఉండవల్లి అనూషా కూడా ఫిర్యాదుచేశారు. ఎమ్మెల్యే భవాని ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను చేసిన ప్రస్తావనను హేళన చేస్తూ తాను, తన కుటుంబ సభ్యులు మానసికంగా కుంగిపోయేవిధంగా కొంతమంది సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో చెప్పుకోలేని విధంగా కామెంట్లు చేశారని వివరించారు. తొలి దిశ పోలీసు స్టేషన్ ఏర్పాటు సంతోషించదగిన విషయమని, అందుకే తనపై అసభ్యంగా కామెంట్లు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశానని ఆమె తెలిపారు. తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ దిశ చట్టం ప్రకారం న్యాయం చేయాలని ఫిర్యాదు చేస్తుంటే సాక్షాత్తూ డీఎస్పీయే చట్టం ఇంకా అమల్లోకి రాలేదని, ఇంకా కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదని సమాధానం చెప్పారని అన్నారు. రాజమహేంద్రవరం దిశ పోలీసు స్టేషన్‌లో రెండో రోజైన ఆదివారం రెండు కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒకటి రాజమహేంద్రవరం ఇన్నీసుపేటకు చెందిన ఒక వరకట్న వేధింపు కేసు, మరొకటి భర్త, అత్త శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారనే ఫిర్యాదు నమోదయ్యాయి.
*చిత్రం...దిశ పోలీసు స్టేషన్ డీఎస్పీకి ఫిర్యాదుచేస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని