క్రైమ్/లీగల్

కేకే ఓటు వినియోగంపై హైకోర్టులో విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ ఎంపిక సందర్భంగా రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు ఎక్స్‌అఫీషియో ఓటు వినియోగించుకోవడంపై మంగళవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై పూర్తి వివరాలను కోర్టుముందుంచాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. మున్సిపల్ ఎన్నికల్లో కే కేశవరావు టీఆర్‌ఎస్ అభ్యర్థికి అనుకూలంగా వోటు వేయడంతో బీజేపీ దక్కించుకోవల్సిన మున్సిపాల్టీని టీఆర్‌ఎస్ వశమైంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ రాజ్యసభ సభ్యుల జాబితాను ఇవ్వాల్సిందిగా పార్లమెంటు సెక్రటరీ జనరల్‌ను కోరడంతో పాటు రాజ్యసభ చైర్మన్‌కు సైతం ఫిర్యాదు చేసింది. సెక్రటరీ జనరల్ ఒక ప్రకటన విడుదల చేస్తూ కే కేశవరావు ఏపీ కోటాలో ఉన్నారని స్పష్టం చేసింది. దాంతో ఏపీ కోటాలో ఉన్న కేశవరావు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో ఓటును ఎలా వినియోగించుకుంటారని బీజేపీ ప్రశ్నించడంతో పాటు ఈ అంశంపై న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని ఆనాడే ప్రకటించింది. ఈ క్రమంలో తుక్కుగూడ బీజేపీ కౌన్సిలర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కే కేశవరావు రాజ్యసభ సభ్యుల కోటా ప్రకారం ఏపీ జాబితాలో ఉన్నారని సెక్రటరీ జనరల్ ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారని తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో వోటు వినియోగించుకోవడం సరికాదని తుక్కుగూడ మున్సిపాల్టీలోని 8 మంది బీజేపీ కౌన్సిలర్లు దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ కోటాలో ఎన్నికైన కే కేశవరావు తుక్కుగూడలో ఎక్స్‌అఫీషియో ఓటు వేయడానికి అనుమతించడం చట్టవిరుద్ధమని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. మున్సిపాల్టీ ఎన్నిల సందర్భంగా ఎన్నికల అధికారిగా వ్యవహరించిన మున్సిపల్ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అయితే ఇలాంటి వివాదాలకు ఎన్నికల ట్రిబ్యునల్ ఉందని హైకోర్టు పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ట్రిబ్యునల్ ఏర్పాటు కాలేదని వారు గుర్తుచేశారు. ట్రిబ్యునల్ ఏర్పాటు కానందునే హైకోర్టును ఆశ్రయించామని కౌన్సిలర్ల తరఫున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురావడంతో ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలను కోర్టుకు అందజేయాలని ఎన్నికల కమిషన్ తరఫున హాజరైన కౌన్సిల్‌ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

*చిత్రం...రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు