క్రైమ్/లీగల్

ఒమర్ నిర్బంధంపై పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా నిర్బంధంపై దాఖలైన పిటిషన్‌పై విచారించే సుప్రీం బెంచ్ నుంచి న్యాయమూర్తి ఎంఎం శంతన్‌గౌడర్ తప్పుకున్నారు. నెలల తరబడి తన సోదరుడు ఒమర్‌ను గృహ నిర్బంధంలో ఉంచారంటూ ఆయన సోదరి సారా అబ్దుల్లా పైలట్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఒమర్ అబ్దుల్లా జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేయడమే కాకుండా నేషనల్ కాన్ఫరెన్స్ అధినేతగా ఉన్నారు. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఒమర్‌ను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. ప్రజా భద్రతా చట్టం కింద ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆగస్టు 5 నుంచి ఒమర్ అబ్దుల్లా పోలీసుల నిర్బంధంలోనే ఉన్నారు. అబ్దుల్లా సోదరి సారా దాఖలు చేసిన పిటిషన్ న్యాయమూర్తులు ఎన్వీ రమణ, శంతన్‌గౌడర్, సంజీవ్ ఖన్నా విచారించాల్సి ఉంది. అయితే విచారణ నుంచి తాను తప్పుకుంటున్నట్టు న్యాయమూర్తి శంతన్‌గౌడర్ ప్రకటించారు. అయితే ఎందుకు వైదొలుగుతున్నదీ కారణాలు మాత్రం ఆయన వెల్లడించలేదు. సారా పైలట్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ గురువారం విచారణకు రావల్సి ఉంది. ఒమర్ అబ్దుల్లా నిర్బంధాన్ని సవాల్ చేస్తూ ఆయన సోదరి సారా అబ్దుల్లా పైలట్ సోమవారం కోర్టును ఆశ్రయించారు. ప్రజాభద్రతా చట్టం 1978 చట్టం కింద నెలల తరబడి ఒమర్‌ను అదుపులో ఉంచారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తన సోదరుడి వల్ల శాంతి భద్రతలకు ఎలాంటి ముప్పులేదని, ఇన్నాళ్లు నిర్బంధంలో ఉంచ డం చట్ట వ్యతిరేకమని సారా ఆరోపించారు. చట్టాన్ని అడ్డుపెట్టుకుని పోలీసులు మితిమీరిన అధికారాలు చెలాయిస్తున్నారని, వ్యక్తులు, రాజకీయ నాయకులను అక్రమంగా నిర్బంధిస్తున్నారని సారా పైలట్ ధ్వజమెత్తారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాను గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. ఐపీసీలోని 107 సెక్షన్ కింద అదుపులోకి తీసుకున్నారు. అధికారుల చర్య రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,21,22 ఉల్లంఘించడమేనని పిటిషనర్ పేర్కొన్నారు. ఒమర్‌ను నిర్బంధిస్తూ జారీ చేసిన ఆదేశాలు కొట్టివేయాలని సారా అభ్యర్థించారు. 2009-14లో ఒమర్ జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

*చిత్రం... నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా