క్రైమ్/లీగల్

సీబీఐ వర్సెస్ సీబీఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సీబీఐ మాజీ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థానా అవినీతి కేసు విచారణ జరుగుతున్న తీరుపై ఢిల్లీ కోర్టు తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేసింది. ఆస్థానాపై ఆయన పనిచేసిన సంస్థ సీబీఐ విచారణ చేపట్టింది. రాకేష్ ఆస్థానాపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినా చార్జిషీట్‌లో ఆయన పేరు తప్పించారు. అవినీతితో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని దర్యాప్తు సంస్థ తేల్చింది. ప్రత్యేక డైరక్టర్ ఆస్థానా, సీబీఐ డీఎస్పీ దేవందర్ కుమార్‌కు దర్యాప్తు సంస్థ క్లీన్‌చిట్ ఇచ్చింది. 2018లో దేవేందర్ కుమార్‌ను అరెస్టు చేశారు. తరువాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. అధికారులిద్దరికీ సీబీఐ క్లీన్‌చిట్ ఇవ్వడంపై ప్రత్యేక న్యాయమూర్తి సంజీవ్ అగర్వాల్ అంసతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి సతీష్ సనా ఆరోపించారు. మాంసం ఎగుమతిదారు మొయిన్ ఖురేషీ కేసుకు సంబంధించి ఆస్థానాపై అతడు అవినీతి ఆరోపణలు చేశాడు. తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులపై దర్యాప్తు తీరును సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి అగర్వాల్ తప్పుబట్టారు. కేసు తదుపరి విచారణ ఈనెల 19కు వాయిదా వేశారు. ఈ కేసులో దుబాయి మధ్యవర్తి మనోజ్ ప్రసాద్‌పై మంగళవారం చార్జిషీట్ దాఖలు చేశారు. అయితే చార్జిషీట్‌లో ఆస్థానాకు సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చేసింది. అలాగే ‘రా’ చీఫ్ ఎస్‌కే గోయల్‌ను తప్పించారు. ఇవే ఆరోపణలతో 2018లో అరెస్టయి బెయిల్‌పై ఉన్న సీబీఐ డీఎస్పీ దేవేందర్ కుమార్‌కూ దర్యాప్తు సంస్థ క్లీన్‌చిట్ ఇచ్చింది. మనోజ్ ప్రసాద్‌ను 2018 అక్టోబర్ 17న అరెస్టు చేయగా అదే ఏడాది డిసెంబర్ 18న బెయిల్ మంజూరైంది. విచారణకు సంబంధించి చార్జిషీట్ దాఖలు చేసిన దర్యాప్తు సంస్థ మరో అదనపు చార్జిషీట్ వేయనున్నట్టు తెలిసింది. ఇలా ఉండగా 60 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉండగా సీబీఐ విఫలం చెందడంతో 2018 డిసెంబర్‌లో మనోజ్ ప్రసాద్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్ ఇచ్చింది. ట్రయల్ కోర్టు గత ఏడాది అక్టోబర్ 31న కుమార్‌కు బెయిల్ మంజూరు చేసింది. డీఎస్పీ కుమార్ అక్టోబర్ 23న అరెస్టయ్యారు.
అయితే కుమార్‌కు బెయిల్ ఇవ్వవద్దని సీబీఐ ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడం గమనార్హం. మాంసం ఎగుమతిదారు మొయిన్ ఖురేషీ అవినీతి కేసుకు సంబంధించి ఆస్థానాకు ముడుపులు ఇచ్చినట్టు హైదరాబాద్ వ్యాపారి సతీష్ సనా ఆరోపించారు. తనకు క్లీన్‌చిట్ ఇవ్వడానికి అధికారి సహకరించారని అతడు తెలిపాడు. విచారణ చేపట్టిన సీబీఐ మనోజ్ ప్రసాద్ దుబాయి నుంచి రాగానే అరెస్టు చేసింది. తనను కేసు నుంచి తప్పించేందుకు ప్రసాద్ అతడి సోదరుడు సోమేష్‌తో రెండు కోట్ల రూపాయలతో ఒప్పందం కుదిరిందని సనా ఆరోపించాడు.