క్రైమ్/లీగల్

జేజేబీ వౌనం వీడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: బాల నేరస్థుల విషయంలో జువైనెల్ జస్టిస్ బోర్డు (జేజేబీ)లు వౌనం వీడాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే పలు సందర్భాల్లో జారీ చేసిన ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించేలా చూడాల్సిన బాధ్యత జేజేబీలపై ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. బాల నేరస్థులను జైలులో లేదా పోలీసు లాకప్‌లో ఉంచకూడదన్న నిబంధనను కొన్ని ప్రాంతాల్లో అమలు చేయడం లేదని విమర్శళు ఉన్నట్లు న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ గుప్తా, అనిరుద్ధ బోస్‌తో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బాల నేరస్థులను పోలీసు లాకప్‌ల్లో ఉంచుతున్నారని, జైళ్ళలో కుక్కి చిత్రవధ చేస్తున్నారని దాఖలైన పిటీషన్లపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. బాల నేరస్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ జైళ్ళకు పంపించకూడదని, అంతేగాక విచారణ కోసం పోలీసు లాకప్‌లలో ఉంచకూడదని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని బేఖాతర్ చేయడం దారుణమని ధర్మాసనం పేర్కొంది. బాల నేరస్థులను జేజేబీ ముందు ప్రవేశ పెట్టినప్పుడు తప్పనిసరిగా బెయిల్ ఇచ్చి తీరాలని గుర్తు చేసింది. బాల హక్కులను పరిరక్షించడానికి ఎన్నో చట్టాలు ఉన్నాయని, సుప్రీం కోర్టు అనేక సందర్బాల్లో పలు ఆదేశాలను, మార్గదర్శకాలను విడుదల చేసిందని ధర్మాసనం పేర్కొంది. ఒకవేళ బెయిల్ రాకపోయినప్పటికీ బాల నేరస్థులను అబ్జర్వేషన్ హోంలో ఉంచాలే తప్ప పోలీసు స్టేషన్‌కుగానీ, జైలుకు గానీ తరలించేందుకు వీలులేదని స్పష్టం చేసింది. ఈ మార్గదర్శకాలను, సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించేలా జేజేబీలు తగిన చర్యలు తసుకోవాలని స్పష్టం చేసింది. అంతేతప్ప వౌనంగా కూర్చొని ప్రేక్షక పాత్ర పోషించడానికి వీల్లేదని కోర్టు వెల్లడించింది.