క్రైమ్/లీగల్

పాత సచివాలయ భవనాలు కూల్చకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నూతన సచివాలయ భవనాల నిర్మాణాలకు సంబంధించిన తుది డిజైన్లను సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తుది డిజైన్లు ఇంకా ఖరారు కాలేదని అధికారులు పేర్కొనగా, అలాంటపుడు పాత భవనాలను కూల్చివేయడంపై తొందర ఎందుకు? అని హైకోర్టు ప్రశ్నించింది. సచివాలయం తరలింపుపై తొందర ఎందుకని ప్రశ్చించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకూ సచివాలయంలో
ఉన్న పాత భవనాలను కూల్చివేయవద్దని పేర్కొంది. నూతన సచివాలయంపై క్యాబినెట్ ఆమోదించిన తుది నమూనాను తీసుకుని కోర్టుకు రావాలని హైకోర్టు పేర్కొంది. ఎలాంటి డిజైన్లు సిద్ధం కానపుడు ఎందుకు పాత సచివాలయ భవనాలను కూల్చివేత చేపట్టారని హైకోర్టు ప్రశ్నించింది. గత విచారణలో కూల్చివేతపై ప్రభుత్వాన్ని సమగ్ర నివేదిక కోరామని, నివేదిక ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం చేయలేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. డిజైన్లు, ప్లాన్లు పూర్తి కానపుడు ప్రభుత్వానికి తొందర ఎందుకు? అని హైకోర్టు ప్రశ్నించింది. అవసరమైన టెక్నాలజీ ఉన్నప్పుడు స్పేస్‌ప్లాన్, డిజైన్ ఇంకా సిద్ధం కాలేదని చెప్పడంలో అర్థం లేదని అన్నారు. కూల్చివేతకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని మరి డిజైన్ ప్లాన్ కోసం నిర్ణయం క్యాబినెట్‌లో ఎందుకు తీసుకోలేదని హైకోర్టు ప్రశ్నించింది. టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో జాప్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించింది. క్యాబినెట్ ఫైనల్ నిర్ణయం తీసుకునే వరకూ కూల్చివేతలను చేపట్టవద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.