క్రైమ్/లీగల్

పురాతన భవనాల కూల్చివేతపై నేడు విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అసెంబ్లీ, సచివాలయ నిర్మాణాల సందర్భంగా అత్యంత పురాతన భవనాల కూల్చివేత తగదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం నాడు హైకోర్టులో విచారణ కొనసాగనుంది. సచివాలయ నిర్మాణానికి స్టోన్ బిల్డింగ్ కూల్చివేత ప్రతిపాదన, అదే విధంగా అసెంబ్లీ నిర్మాణానికి ఎర్రమంజిలి భవనం కూల్చివేతతో పాటు వారసత్వ సంపద పరిధిలోని పురాతన భవనాల చట్టాన్ని అతిక్రమించి వాటిని కూల్చివేసి కొత్త భవనాల నిర్మాణం సరికాదని దాఖలైన పిటిషన్లపై ఈ విచారణ జరగనుంది.
కేకేపై పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
తుక్కుగూడ మున్సిపాల్టీలో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే కేశవరావు ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా ఓటు వేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఏపీ పరిధిలోని కేకే తెలంగాణ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారని బీజేపీ కౌన్సిలర్లు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.