క్రైమ్/లీగల్

బస్టాండ్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చల్లపల్లి, ఫిబ్రవరి 13: స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో గురువారం గుర్తు తెలియని ఒక వ్యక్తి మృతి చెందాడు. సాయంత్రం 4గంటల సమయం వరకు గళ్ల చొక్కా, ఫ్యాంట్ ధరించి గడ్డం పెంచుకుని వున్న వ్యక్తి బస్టాండ్‌లో బస్‌కోసం వేచి చూస్తూ తోటి ప్రయాణికులకు కనిపించాడు. 5గంటల సమయంలో ఒక్కసారిగా ఆ వ్యక్తి పడిపోవటంతో స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అయితే అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందడంతో కంట్రోలర్ డిపో అధికారులకు, పోలీసులకు సమాచారమిచ్చారు. చల్లపల్లి ఎస్‌ఐ నాగరాజు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.