క్రైమ్/లీగల్

విద్యార్థిని హంతకులెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఫిబ్రవరి 13: కరీంనగర్‌లో ఇంటర్ విద్యార్థిని ముత్త రాధికను గొంతు కోసి దారుణంగా హత్య కేసును ఛేదించడం పోలీస్ యంత్రాంగం సవాల్‌గా తీసుకుంది. ఈనెల 10న నగరంలోని విద్యానగర్ ప్రాంతంలోని ఇంటిలో రాధిక దారుణ హత్య కేసు ఛేదించేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ నుండి ఐదు బృందాలు గురువారం రాధిక స్వగృహాన్ని సందర్శించి కీలక మైన ఆధారాలు సేకరించారు. సిటీ పోలీస్ క్లూస్ టీం ఇన్‌చార్జి ఇంద్రాణి ఆధ్వర్యంలో ఐదు బృందాలు జర్మనీ టెక్నాలజీ ఉపయోగించి రక్తపుమరకలు కడిగినవి తెలుసుకొనే టెక్నాలజీలో భాగంగా త్రీడి క్రైమ్ సీన్ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, త్రీడి స్కేనర్, బాడీ ఫ్లుడ్ కిట్టులను ఉపయోగించి ముఖ్యమైన ఆధారాలు స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించే పనిలో పడ్డారు. సాధ్యమైనంత తొందరగా రాధిక దారుణ హత్య గురించి విశే్లషించుకొని నిందితున్ని పట్టుకునేందుకు ప్రణాళికాయుతంగా ముందుకెళ్తున్నట్టు ఆమె ఈ సందర్భంగా తెలిపారు. అయితే ఇది తెలిసిన వారి పనా? లేక ప్రేమోన్మాది చేసిన పనా? మరెవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? ఇలా అన్ని కోణాల్లో సమగ్ర విచారణ కొనసాగించినా ఖాకీల విచారణకే అంతుచిక్కని అంశంగా మారింది. ఇది సవాల్‌గా తీసుకొని ఏదేమైనా రాధిక హంతకుల పట్టుకొని తేల్చే పనిలో పోలీసులు తలమునకలయ్యారు. రాధిక దారుణ హత్య కేసు రోజుకో కొత్తమలుపు తిరుగుతుండగా, ఇదివరకే నలుగురు యువకు లను అదుపులోకి తీసుకొని విచారించినా ఫలితం లేకపోవడంతో హైదరాబాద్ క్రైమ్ సైన్స్ అధికారిణి ఇంద్రాణి ఐదు బృందాలతో విచారణను ముమ్మరం చేశారు. అన్ని కోణాల్లో విచారణ చేసినా హంతకుడు బయట పడకపోవడంతో డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ రిపోర్టు, సీసీ కెమెరాల నివేదికను కూడా ఉపయోగపడలేదని నిర్ధారణకొచ్చాక హైదరాబాద్ క్రైమ్ సైన్స్ ఆఫీసర్‌కు ఈ కేసును అప్పగించినట్టు తెలుస్తోంది. హత్య జరిగిన సంఘటన తీరును బట్టి చూస్తే పథకం ప్రకారం కాకుండా అనుకోకుండా జరిగినట్టు తెలుస్తోందని పోలీసులు వెల్లడిస్తున్నారు. నిందితుల ఎలాంటి ఆనవాళ్ళు చిక్కకుండా హత్య చేయడంతో కేసులో హంతకుడెవరనేది పోలీసులు, నగరవాసులను కలవరపరుస్తోంది. ఇదివరకు ఈ కేసులో నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ కొనసాగించినా వారంతా అమాయకులేనని తేలిపోవడంతో అంతు చిక్కని కేసును ఎలాగైనా ఛేదించాలనే పనిలో పోలీసులు పడ్డారు.
కాగా క్రైమ్ సైన్స్ ఆఫీసర్ ఇంద్రాణి గురువారం రాధిక ఇంటిని, రక్తపు మడుగులను పరిశీలించారు. ఆమె చుట్టుపక్కల వాళ్లను సైతం విచారించి రాధిక ఇంటిలోకి వచ్చి బయటకు వెళ్లే మార్గాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ వేలిముద్రలు కూడా పోల్చి చూసినా ఫలితం దక్కకపోవడంతో హంతకులు ఎవరనేది తేల్చడం పోలీసులకే పెనుసవాల్‌గా మారింది. కాగా, రాధిక హత్య కేసు ఛేదించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించకపోవడంతో నిందితుల వివరాలు వెల్లడిస్తే తగిన పారితోషికాన్ని అందించడంతో పాటు పేర్లను గోప్యంగా ఉంచుతామని వెల్లడిస్తుండడం కొసమెరుపు.
*చిత్రం... రాధిక హత్య కేసులో అసలు నిందితులెవరనేది అంతు చిక్కక పోవడానికి గల కారణాలు అడిగి తెలుసుకుంటున్న క్రైమ్ సైన్స్ బృందం