క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లి: కోల్‌కతా- చెన్నై జాతీయ రహదారిపై గంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుండి ప్రకాశం జిల్లా సింగరాయకొండకు ఐరన్ గడ్డర్ల లోడుతో వెళుతున్న లారీని తెల్లవారుజామున 4.30కు విజయవాడ కనకదుర్గ వారధి దాటాక జాతీయ రహదారిపై నిలిపేసి, లోడుకు కట్టిన తాళ్లు సరిచేస్తుండగా వెనుక నుంచి వచ్చిన ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ వెనుక ఉండి తాళ్లు సరిచేస్తున్న ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన లారీ డ్రైవర్ గరికె మల్లారెడ్డి (50), క్లీనర్ మనె్నం బ్రహ్మయ్య (56) అక్కడికక్కడే మృతిచెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న విజయవాడ రాణీగారి తోటకు చెందిన గన్నమనేని ప్రభాకర్ (42) కూడా సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. అదే ఆటోలో
ఉన్న ప్రభాకర్ పెద్ద కొడుకు పూర్ణచంద్రరావు స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. ఆటో డ్రైవర్ తిరుమలరావు, మరో ప్రయాణికుడు ఏడుకొండలు ఆటో క్యాబిన్‌లో ఇరుక్కుపోయారు. సంఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది ఆటోలోని డ్రైవర్‌కు, ఏడుకొండలుకు ప్రథమ చికిత్స నిర్వహించారు. తాడేపల్లి సీఐలు అంకమరావు, మల్లికార్జున సంఘటన స్థలానికి చేరుకుని రెండు గంటల పాటు కష్టపడి ఆటో డ్రైవర్ ఏడుకొండలును బయటికి తీసి వైద్యం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటోలో ఇరుక్కుపోయి చనిపోయిన గన్నమనేని ప్రభాకర్ మృతదేహాన్ని క్రైన్ సహాయంతో వెలికి తీశారు. రోడ్డు ప్రమాదం తెలుసుకున్న తహశీల్దార్ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

*చిత్రం... ప్రమాదంలో నుజ్జయిన లారీ వెనుకభాగం,
సంఘటనా స్థలంలో మృతదేహాలు