క్రైమ్/లీగల్

బ్రదర్ అనిల్‌కు తప్పిన ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్, ఫిబ్రవరి 15: క్రైస్తవ మత ప్రబోధకుడు బ్రదర్ అనిల్‌కుమార్ ప్రయాణిస్తున్న కారు శనివారం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అనిల్ సురక్షితంగా బయటపడ్డారు. బ్రదర్ అనిల్ హైదరాబాద్ నుండి విజయవాడ కారులో బయలుదేరగా కృష్ణా జిల్లా సరిహద్దుల్లో జగ్గయ్యపేట మండలంలోని గరికపాడు చెక్‌పోస్టు వద్ద శనివారం తెల్లవారుజామున కారు అదుపుతప్పి రోడ్డు మార్జిన్ దిగి పంట పొలాల్లోకి దూసుకెళ్ళింది. కారులోని బెలూన్‌లు తెరుచుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పి బ్రదర్ అనిల్ సురక్షితంగా బయటపడ్డారు. ఆయనతో పాటు కారుడ్రైవరు, గన్‌మెన్‌లకు స్వల్ప గాయాలయయ్యాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను హుటాహుటీన సంఘటన స్థలానికి వెళ్ళి వారిని తన కారులో విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం బ్రదర్ అనిల్ తన పర్యటనకు తరలివెళ్ళారు.

*చిత్రం... పంట పొలాల్లోకి దూసుకెళ్ళిన కారు