క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన విద్యాశాఖ రికార్డ్ అసిస్టెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాబాద్, ఫిబ్రవరి 15: విధినిర్వహణలో భాగంగా తాను చేయాల్సిన పనికి డబ్బు ముట్టచెప్పాల్సిందే అని డిమాండ్ చేసాడో ప్రభుత్వ విద్యాశాఖ అధికారి. న్యాయంగా తనకు రావాల్సిన సొమ్ము కోసం లంచం ఇవ్వటం ఇష్టం లేని సీనియర్ సిటిజన్ అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు బాధితుడు లంచం ఇస్తుండగా తీసుకున్న విద్యాశాఖ అధికారిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పూర్తివివరాలు ఈవిధంగా ఉన్నాయి... సైదాబాద్ ఒవైసీనగర్‌కు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి మిర్ గజన్‌ఫర్ అలీఖాన్‌కు చెందిన భవనంలో గత సంవత్సరం ఏప్రిల్ వరకు విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాఠశాలను నిర్వహించారు. దానికి సంబంధించిన అద్దె రూ.12లక్షల 26వేలలో అతని ఖాతకు రూ.11లక్షలను అధికారులు గత ఆగస్టులో జమ చేసారు. మిగిలిన రూ.1లక్షా26వేలు విషయమై ఐటీ పేచీ ఏర్పడింది. సీనియర్ సిటిజన్ అయినందున బాధితుడికి ఐటీ వెసులుబాటు ఉంది. ఈవిషయాన్ని మలక్‌పేట బీబ్లాక్స్‌లోని సైదాబాద్ రేంజ్-1 డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ స్కూల్స్ కార్యాలయంలో రికార్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించే గద్దం బాబురాజు నిర్దారించి రిపోర్ట్ ఇవ్వాలి. అయితే తాను ఆపని చేయాలంటే రూ.10వేలు ఇవ్వాలని బాబురాజు బాధితుడ్ని డిమాండ్ చేసాడు. తనకు రావాల్సన బకాయి సొమ్ము కోసం లంచం ఇవ్వటం ఇష్టం లేని అలీఖాన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు శనివారం సైదాబాద్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ కార్యాలయంలో అలీఖాన్ పదివేల రూపాయలను బాబురాజుకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. కేసు విచారణలో ఉందని అధికారులు పేర్కొన్నారు.