క్రైమ్/లీగల్

భర్త తిట్టాడని గృహిణి ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడూరు, ఫిబ్రవరి 16: ఎక్కడో గుంటూరు జిల్లా పెనుమూడి గ్రామానికి చెందిన విశ్వంశెట్టి ఉమా (48) అనే మహిళ చనిపోవటానికి సిద్ధపడి ఒక్కతే పాలకాయతిప్ప బీచ్ వైపు వడివడిగా వెళుతూ స్థానిక మత్స్యకారుల కంటపడి చివరకు పోలీసుల కౌన్సిలింగ్ అనంతరం కుటుంబ సభ్యులను కలిసిన సంఘటన కోడూరు మండలంలో శనివారం రాత్రి పొద్దుపోయిన తరువాత చోటు చేసుకుంది. శని, ఆదివారాలలో హంసలదీవి బీచ్‌కు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండటం, పాలకాయతిప్ప గ్రామానికి చెందిన కొందరు ఆటోలు నడుపుతుండటం పూర్తయి రాత్రి 7గంటల సమయంలో ఇంటికి చేరుతుండగా ఎదురు వచ్చే వాహనం లైట్లకు కనపడకుండా పొదల్లో దాక్కున్న మహిళ ఆటోవాలాకు తారసుపడింది. హంసలదీవి బీచ్‌లో జరుగుతున్న పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న మాజీ సర్పంచ్, ఆటో డ్రైవర్ కొక్కిలిగడ్డ సముద్రాలు ఆటో ఆపి ఆమె దగ్గరకు వెళ్లి ఏమిటమ్మా ఒక్కదానివే ఎందుకున్నావని అడుగగా నా భర్త తిట్టాడు చనిపోవాలి అనుకుంటున్నాని అని చెప్పుకుంది. ఆమెకు నచ్చచెప్పి ఆటోలో ఎక్కించుకుని పాలకాయతిప్ప మెరైన్ పోలీసు స్టేషన్ సిబ్బందికి అప్పగించగా వారు కోడూరు ఎస్‌ఐకు సమాచారం ఇచ్చి పెనుమూడి నుంచి బంధువులను కోడూరు పోలీసు స్టేషన్‌కు రప్పించారు. ఈలోగా ఆమెను పాలకాయతిప్ప నుంచి కోడూరు పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. భార్య, భర్తలకు ఎస్‌ఐ పి రమేష్ కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఏది ఏమైనా నాకెందుకులే అని వదిలేయకుండా ఆటో ఆపి మహిళ పరిస్థితి తెలుసుకుని ఆమెను రక్షించిన మాజీ సర్పంచ్ కొక్కిలిగడ్డ సముద్రాలను అందరూ అభినందిస్తున్నారు.