క్రైమ్/లీగల్

కాల్వలో కారు... కారులో మూడు మృతదేహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఫిబ్రవరి 17: కరీంనగర్ శివారు అల్గునూరు వద్ద కాకతీయ కాలువ నుంచి సోమవారం ఒక కారు బయటపడటం, అందులో మూడు మృతదేహాలు కుళ్లిన స్థితిలో ఉండటం సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయ. ఆదివారం రాత్రి ఓ ద్విచక్ర వాహనం అదుపుతప్పి కాలువలో పడిపోయంది. దాని కోసం గాలింపు చర్యలు చేపట్టగా కాల్వలో ఒక కారు ఉండటాన్ని గమనించిన పోలీసులు దానిని క్రేన్ సహాయంతో వెలికితీశారు. అందులో మూడు మృతదేహాలు ఉన్నాయ. కారు నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేయగా అవి పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సొంత సోదరి నరెడ్డి రాధ (50), బావ సత్యనారాయణ రెడ్డి (55), వారి కుమార్తె వినయశ్రీగా గుర్తించారు. ఆదివారం రాత్రి గనే్నరువరం మండల కేంద్రానికి చెందిన దంపతులు కాకతీయ కాలువలో పడిన క్రమంలో వారిని గుర్తించేందుకు ఎస్సారెస్పీ కాలువలో నీటి ప్రవాహాన్ని తగ్గించి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కాకతీయ కెనాల్‌కు కిలోమీటర్ దూరంలో బోల్తాపడి ఉన్న కారు బయటపడింది. సమాచారం అందుకున్న ఎల్‌ఎండి ఎస్‌ఐ నరేష్ రెడ్డి తన సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని కారును బయటకు తీయగా అందులో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. కారు నెంబర్ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు అది పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి కుటుంబంగా నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం ఆమె కరీంనగర్‌లో నివాసం ఉంటూ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. సత్యనారాయణరెడ్డి ఎరువుల దుకాణం నిర్వహిస్తుండగా వినయశ్రీ నిజామాబాద్‌లోని ఓ దంత వైద్య కళాశాలలో బీడీఎస్ చదువుతోంది. ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. సంఘటనా స్థలాన్ని సీపీ వి.బి.కమలాసన్ రెడ్డి సందర్శించి అక్కడి పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం కెనాల్‌లో కారు కనిపించగానే క్రేన్ తెప్పించి బయటకు తీశామని, అందులో మూడు మృతదేహాలు బయటపడ్డాయని అన్నారు. ఆ కారు నెంబర్ ఆధారంగా పెద్దపల్లికి చెందిన ఎమ్మెల్యే బావ, సోదరి, మేన కోడలుగా గుర్తించామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని, మరిన్ని వివరాలు దర్యాప్తులో బయటపడనున్నాయన్నారు.
ఇదిలా ఉండగా, గత నెల 27న ఇంటి నుంచి తన బావ, సోదరి, మేనకోడలు కారులో హైదరాబాద్ బయలుదేరి అటువైపు వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఈ ఘోరం జరిగినట్టు పోలీసులు చెబుతున్నారని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తెలిపారు. నీటిలో మృతదేహాలతోపాటు అందులో ఒక బ్యాగు దొరికిందని, మెడలో ఆభరణాలు, సెల్‌ఫోన్ కూడా లభ్యమైనట్లు పోలీసులు చెప్పారని వివరించారు. తన సోదరి కుటుంబం మృతిపై ఎమ్మెల్యే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత నెల 27న ఇంటి నుంచి బయలుదేరితే తీర్థయాత్రలకు వెళ్లి ఉంటారని భావిస్తే విషాదం వెలుగుచూడటం నమ్మలేకపోతున్నామన్నారు. సోదరి కుటుంబం మృతిపై అనుమానాలు లేవని, గత నెల 27న సాయంత్రం ఊరికి వెళ్లాలనే ఆలోచనతో ఉండగా, ఈ క్రమంలో అనుకోని సంఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని రోజులుగా కనిపించకపోవడంతో బంధువుల ద్వారా ఆచూకీకోసం ప్రయత్నించామని చెప్పారు. తిరిగి రాకపోతారా? అని ఎదురు చూశామని, కానీ, ఇలా కాకతీయ కాలువలో కారుతో సహా మృతదేహాలు బయటపడటం బాధాకరమన్నారు. తన సోదరి కుటుంబంలో ఎలాంటి ఆర్థిక, ఇతర ఇబ్బందులు లేవని వెల్లడించారు.
హత్యా? ప్రమాదమా?
గత 20 రోజులుగా కనిపించకుండా పోయిన కుటుంబం అదృశ్యం విషాదాంతంగా మారడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇవి హత్యలా, లేక ప్రమాదవశాత్తు జరిగిందా అన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయ. చాలా రోజులుగా ఒక కుటుంబం కనిపించకుండా పోతే ఫిర్యాదు చేయలేదా? ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదా? అన్న ప్రశ్నలు సైతం ఉద్భవిస్తున్నాయ. ప్రతి ఒక్కరికీ సెల్‌ఫోన్ ఉన్న ప్రస్తుత పరిస్థితిల్లో సెల్‌ఫోన్ నెంబర్లు, కారు నెంబర్ ఆధారంగానైనా వారి ఆచూకీ కోసం ప్రయత్నం చేయలేదా? లేక వారు ఇన్ని రోజులుగా కన్పించకుండా పోయనా ఎవరూ పట్టించుకోలేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ. కాలువలో నీటి మట్టం తగ్గంచడం వల్ల కారు బయటపడి వారి మృతి సంగతి తెలిసింది కాని, అలా కాకుండా ఉంటే వారి అదృశ్యం మిస్టరీగానే మిగిలి ఉండేదేమో అనిపిస్తోంది. మరోవైపు ఈ కెనాల్ వద్ద గత రెండు నెలల కాలంలో పది నుంచి 15 ప్రమాదాలు జరిగాయని, అయినా చర్యలు చేపట్టకపోవడానికి గల కారణాలు ఏమిటో అర్థం కావడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు. ఇరుకైన వంతెన కావడం, రెయిలింగ్ కూడా సరిగా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. కాకతీయ కాలువలో పడిన కారులో మూడు మృతదేహాలు కుళ్లిపోయి బయటపడటంతో అక్కడే పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులు స్వగ్రామానికి తరలించారు. కాకతీయ కాలువ నీటిని పూర్తిగా నిలిపివేయడంతో కారుతో సహా అందులో పడిపోయిన మూడు మృతదేహాలు బయటపడటంతో అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్టు సీపీ వి.బి.కమలాసన్ రెడ్డి వెల్లడించారు. ఇదిలా ఉండగా ఆదివారం మానేరు బ్రిడ్జిపై నుండి కారుతో సహా పడిపోయి ఉపాధ్యాయుడు శ్రీనివాస్ మృతి చెందగా, తీవ్ర గాయాలతో ఆయన సతీమణి స్వరూప బయట పడింది. ప్రమాద సంఘటనను పరిశీలిస్తున్న కానిస్టేబుల్ చంద్రశేఖర్ అందులోనే కాలు జారిపడిపోయి మృతి చెందారు. వరుస ప్రమాదాలతో వాహనదారులు వణుకుతున్నారు. ఈ ప్రమాదం జరిగి 24 గంటలు కాక ముందే కాకతీయ కాలువలో కారుతో సహా మరో మూడు మృతదేహాలు వెలుగుచూడటం కలకలం రేపుతోంది.
*చిత్రం... కాకతీయ కాలువలో కారుతో సహా బయటపడిన మూడు మృతదేహాలు