క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన అటెండర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 17: ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ అటెండర్ ఒకరు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ వైనం మహబూబ్‌నగర్‌లో చోటు చేసుకుంది. సోమవారం మహబూబ్‌నగర్ పట్టణంలోని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయ అటెండర్ వాజీద్ రూ.4 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. గద్వాలకు చెందిన రాహుల్ అనే వ్యాపారి తన ఫుడ్‌లైసెన్స్‌ను రెన్యువల్ చేయాలని కోరగా రెన్యువల్ కావాలంటే తనకు నాలుగు వేల రూపాయల లంచం ఇవ్వాలని అటెండర్ వాజీద్ డిమాండ్ చేశాడు. దీంతో రాహల్ ఏసీబీ అధికారులను అశ్రయించారు. ఏసీబీ డీఎస్పీ కృష్ణతో పాటు సిబ్బంది మాటు వేసి లంచం తీసుకుంటున్న వాజీద్‌ను రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని, వాజీద్‌ను అదుపులోకి తీసుకున్నామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.
*చిత్రం... లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయ అటెండర్ వాజీద్‌ను విచారిస్తున్న ఏసీబీ అధికారులు