క్రైమ్/లీగల్

ఆర్టీసీ బస్సు చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, ఫిబ్రవరి 17: బస్టాండ్ నుంచి ఆదివారం రాత్రి బస్సు చోరీకి గురైంది. నేనే డ్రైవర్, నేనే కండక్టర్ అంటూ ఓ అగంతకుడు తస్కరించి కొంత దూరం తీసుకెళ్లి వదిలి పారిపోయాడు. తాండూరు బస్టాండ్‌లో కరణ్‌కోట్ మీదుగా ఓగీపూర్ గ్రామానికి వెళ్లేందుకు పాయింట్‌పై బస్సును నిలిపి డ్రైవర్ ఇలియాస్ కండక్టర్ జగదీష్ భోజనాలకు వెళ్లారు. బస్సులో సుమారు 25 మంది వరకు ప్రయాణికులు సైతం ఎక్కి కూర్చున్నారు. ఓ గుర్తు తెలియని దుండగుడు వచ్చి రాత్రి 9.30 గంటలకు బస్సును స్టార్ట్ చేసి బస్టాండ్ నుంచి తస్కరించాడు. కండక్టర్ లేడని డ్రైవర్‌కు ప్రయాణికులు చెప్పినా డ్రైవర్, కండక్టర్ తానే అంటూ వేగంగా తీసుకెళ్లాడు. దుండగుడు మద్యం మత్తులో అడ్డదిడ్డంగా నడపటంతో ప్రయాణికులు వారించడంతో పట్టణ శివారులో బస్సును ఆపి ఉడాయించాడు. డ్రైవర్, కండక్టర్ భోజనాలు చేసి వచ్చి చూడగా బస్టాండ్ పాయింట్ మీద ఉంచిన బస్సు కనిపించకపోవటంతో ఖంగుతిన్నారు. డిపో సెక్యూరిటీకి, మేనేజర్ రాజశేఖర్‌కు చోరీ ఘటన సమాచారం అందించారు.పోలీసుల దుండగుడి కోసం వేట ప్రారంభించారు.