క్రైమ్/లీగల్

ఊపిరి తీసిన అతివేగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనత్‌నగర్, ఫిబ్రవరి 18: అతివేగం ఓ యువకుడి ప్రాణాలను బలిగొనగా మరో ఐదుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. మంగళవారం తెల్లవారుజామున అతివేగంతో ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ఫ్లై ఓవర్ పై నుంచి కింద పడింది. బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై జరిగిన ప్రమాదం మరవక ముందే అదే తరహాలో నగరంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు తీవ్రగాయాలు పాలుకాగా 20 ఏళ్ల సోహెల్ మృతి చెందాడు. సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి...బోరబండ పండిట్ నెహ్రునగర్‌కు నివాసం ఉండే సొహెల్, ఇర్ఫాన్, సునిల్, అశ్వక్, సోహెల్, గౌస్‌లు స్నేహితులు. మృతిచెందిన సోహెల్ తన తండ్రి నిర్వహిస్తున్న ఛాయ్ దుకాణంలో పనిచేస్తుండగా, మిగిలిన ఐదుగురు ఎసీ టెక్నీషియన్లుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం రాత్రి వీరంతా కారులో ఇండ్ల నుంచి బయలుదేరి వివిధ ప్రాంతాలు సందర్శించి తిరిగి బోరబండకు బయలుదేరారు. మూసాపేట ఫ్లై ఓవర్‌పై 120 కి.మిటర్ స్పీడ్‌తో ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పిన ఫ్లై ఓవర్ రైలింగ్‌ను ఢీకొని కింద పడ్డారు. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ సీటు పక్కన కూర్చొని ఉన్న సోహెల్ (20) మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రగాయాల పాలయ్యారు. సమాచారం తెలుసుకున్న సనత్‌నగర్ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మరో యువకుడి పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్టు తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ప్రమాదం పగటి పూట చోటుచేసుకొని ఉంటే మరికొంత మంది గాయాపడే వారని, ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.