క్రైమ్/లీగల్

ఐటీ ఉద్యోగి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, ఫిబ్రవరి 18: ఐటీ ఉద్యోగులు మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో మానసిక ఒత్తిడితో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం సన్ని బాబు (33) గచ్చిబౌలి జెన్‌ప్యాక్ ఐటీ సంస్థలో ఐదు సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తన బావ సంపత్ కుమార్‌కు మెయిల్ పంపాడు. వెంటనే సంపత్ కుమార్ నాగారం నుంచి వచ్చి చూడగా గడియ పెట్టి ఉండడంతో డోర్ పగులగొట్టి చూడగా ఉరి వేసుకుని ఛనిపోయి ఉన్నాడు. గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. అమెరికాలో వున్న తల్లిదండ్రులు ప్రసాద్ రావు, సుజాత కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలియడంతో హైదరాబాద్‌కు వస్తున్నట్లు సన్ని బావ సంపత్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.