క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన బిల్ కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, ఫిబ్రవరి 18: అవినీతి సొమ్ముకు అలవాటుపడ్ట బిల్ కలెక్టర్ పది వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన సంఘటన పోచారం పురపాలక సంఘం ఇస్మాయిల్‌ఖాన్‌గూడ వార్డు కార్యాలయంలో మంగళవారం జరిగింది.
అవినీతి నిరోధక శాఖ అధికారులు, బాధితుని కథనం ప్రకారం.. పోచారం పురపాలక సంఘం కార్యాలయం పరిధిలో ఇస్మాయిల్‌ఖాన్‌గూడ, యంనంపేట్‌లకు సంబంధించిన బిల్‌కలెక్టర్‌గా పులి కుమార స్వామి విధులు నిర్వహిస్తున్నాడు. నగర శివారు ప్రాంతం కావటంతో ఇక్కడ రియల్ భూంతో పాటు నూతన గృహ నిర్మాణాలు ఎక్కువగా జరుగుతుంటాయి. దీంతో ఉన్నతాధికారుల పేర్లు వాడుకుని అవినీతి సొమ్ముకు బిల్ కలెక్టర్ కుమార స్వామి అలవాటు పడ్డాడు. ఇస్మాయిల్‌ఖాన్ గూడకు చెందిన చంద్రగోని బాలరాజు తన ఇళ్లు గ్రామ కంఠం స్థలంలో లేదని నిరభ్యంతర(ఎన్‌ఓసీ) పత్రం కావాలని గత సంవత్సరం జూన్ మాసంలో దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. అప్పటి నుంచి పలు కారణాలు చెప్పి తిప్పించుకుంటు ఎన్‌ఓసీ కావాలంటే 25 వేల రూపాయలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఎన్‌ఓసీ తొందరగా కావాలి అని అడిగినా ఎంత బ్రతిమాలడినా ఇవ్వకుండా డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో బాధితుడు తప్పనిసరి పరిస్థితిలో అవినీతి నిరోధక శాఖ అధికారులను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఎక్కువ డబ్బులు ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నానని, పది వేలు తీసుకుని ఎన్‌ఓసీ ఇవ్వాలని బ్రతిమాలుకోగా అంగీకరించినట్లు తెలిపారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఇస్మాయిల్‌ఖాన్‌గూడలోని పురపాలక సంఘం వార్డు కార్యాలయానికి వెళ్లిన బాధితుడు బాలరాజు ఏసీబీ అధికారులు ఇచ్చిన డబ్బులను బిల్ కలెక్టర్‌కు ఇచ్చినట్లు పేర్కొన్నారు. వెంటనే ఏసీబి అధికారులు డీఏస్పీ సూర్యనారాయణ, ఇన్‌స్పెక్టర్ రామలింగా రెడ్డి దాడి జరిపి అవినీతి సొమ్మును స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితుడు గతంలో పలు అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఉన్న ఆధారాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరిలించినట్లు ఏసీబి ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.