క్రైమ్/లీగల్

కాటూరు దోపిడీ కేసులో ఐదుగురు దొంగల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉయ్యూరు, ఫిబ్రవరి 18: మండలంలోని కాటూరు గ్రామంలో ఈ నెల 10 అర్ధరాత్రి రియల్టర్ ఇంటిలో జరిగిన దొంగతనంలో చోరీకి పాల్పడిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. పట్టణ పోలీస్టేషన్ ప్రాంగణంలో విజయవాడ పోలీసు కమీషనర్ ద్వారకాతిరుమలరావు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కేసును చేధించిన విధానాన్ని ఆయన వివరించారు. 1995-1998 ప్రాంతంలో ఇదే తరహాలో చోరీలకు పాల్పడిన సంఘటనల ఆధారంగా కేసును చేధించ గలిగామన్నారు. అప్పట్లో దొంగలు గ్రూపుగా ఏర్పడి ఊరికి దూరంగా ఉండే ఇళ్ళను ఎంచుకొని, అందులో నివాసముంటున్న వారిని మారణాయుధాలతో బెదిరించి, వారిని కట్టివేసి దొంగతనానికి పాల్పడేవారని వివరించారు. అదే తరహాలో జరిగిన ఈ చోరీ విషయాన్ని దర్యాప్తు చేసిన తమకు, ఆధునిక టెక్నాలజీ సహాయంతో దొంగలను గుర్తించామన్నారు. రాష్ట్రేతర భాష మాట్లాడటంతో తొలుత అంతరాష్ట్ర దొంగల ముఠా పనిగా తాము కూడా భావించామని, దొంగలు నిక్కర్లు ధరించడంతో చెడ్డీ గ్యాంగ్ పనిగా అనుకున్నామని, అయితే వివిధ కోణాలలో ఈ కేసును ఐదు టీంలుగా ఏర్పడి పరిశోధించామని, ఈ తరహా దొంగతనాలు మంగళగిరి ప్రాంతంలో నివసించే పెద్దింటి గొల్ల గ్యాంగ్ పనిగా భావించి, నిర్ధారించి పట్టుకున్నామని చెప్పారు.
తోట్లవల్లూరు మండలం బొడ్డపాడు గ్రామం వద్ద నివాసాలు ఏర్పర్చుకుని ఆరుగురు సభ్యులు బృందం ఈ చోరీకి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చామన్నారు. పాలశివ అలియాస్ రాజేష్, శ్రీనివాస్, శ్రీనివాసులు, శివశంకర్, పెనుమాక మహేష్, మేకల ఏసు, దొడ్డి పోతురాజు, పాల వేణుతో పాటు మరొక వ్యక్తి ఈ దొంగతనానికి పాల్పడ్డారని తెలిపారు. పదవ తేదీ రాత్రి ఆటోలో కాటూరు వచ్చిన వారు తొలుత పలుగుతో ఇంటి తలుపును పగలగొట్టేందుకు ప్రయత్నించారని, వీలు కాకపోవడంతో బండరాయితో ఇంటి తలుపు పగలగొట్టేందుకు ప్రయత్నించారన్నారు. అనంతరం ఇంటిలోకి ప్రవేశించి యజమాని రజనీకాంత్‌ను ఆయన భార్యను కత్తులతో బెదిరించి, వారిని తాళ్ళతో కట్టి చోరీకి పాల్పడ్డారని అన్నారు. అనంతరం ఆదే ఆటోలో వెళ్ళిపోయారని, ఈ చోరీలో 62 గ్రాముల బంగారు నగలు, వెయ్యి రూపాయల నగదును తస్కరించారన్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి, క్లూస్ టీం, డాగ్ స్వ్కాడ్, వేలిముద్రల నిపుణులతో కేసును శోధించామన్నారు. అనంతరం ఈ సంఘటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని లా అండ్ ఆర్డర్ -1 డీసీపీ హర్షవర్ధనరాజు, క్రైం డీసీపీ డి.కోటేశ్వరరావు పర్యవేక్షణలో సీసీఎస్ ఏసీపీ కె.శ్రీనివాసరావు, ఈస్ట్‌జోన్ ఏసీపీ కె.సురేంద్రనాధ్‌రెడ్డి ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి కేసును కేవలం వారం రోజుల్లో కనిపెట్టామని చెప్పారు. కాగా తాము మంగళవారం ఉదయంతో అరెస్టుల పర్యం పూర్తి చేసి, ఐదుగురు నిందితులను అరెస్టు చేసామని, ఆరో అతనిని కూడా త్వరలో పట్టుకుంటామనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. అరెస్టయిన వారి నుండి 22 గ్రాముల బంగారు నగలు, రూ.వెయ్యి నగదు, ఒక ఐఫోన్, మంకీక్యాప్‌లు, చేతిగ్లౌస్‌లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇదే తరహాలో తెలంగాణా రాష్ట్రంలోని మిరియాలగూడలో కూడ వీరే చోరీకి పాల్పడినట్లు తెలిసిందని, వీరంతా తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలో వివిధ దోపిడీలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. ఈ కేసును పరిశోధించిన అధికారులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులతో పాటు సీఐ నాగప్రసాద్, పలువురు సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.