క్రైమ్/లీగల్

అబ్దుల్ కరీం తుండా కేసు తీర్పు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 18: ఇస్లామిక్ ఉగ్రవాది అబ్దుల్ కరీం తుండా మారణహోమం కుట్రపై నాంపల్లి క్రిమినల్ కోర్టు తీర్పు మరోమారు వాయిదా పడింది. ఫిబ్రవరి 4నే తీర్పు వెలువడాల్సి ఉన్నా, కేసు ఫిబ్రవరి 18కి వాయిదా పడింది. అయితే న్యాయమూర్తి సెలవులో ఉండటంతో తుది తీర్పు మరో మారు మార్చి 3కి వాయిదా పడింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోనూ, హుమయూన్‌నగర్‌లో బాంబు పేలుళ్లకు ప్రయత్నించిన ఆరోపణలతో పాటు 1998లో గణేష్ ఉత్సవాల్లో పేలుళ్ల కుట్రకు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థతో లష్కరీ తొయిబా ఉగ్రవాద సంస్థతో, ఐఎస్‌ఐతో కలిపి కార్యకలాపాలకు పాల్పడినట్టు తుండా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బాంబుల తయారీలో నిపుణుడిగా ఆయనకు పేరుంది. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం ముజాహిద్దీన్ సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రతీకార చర్యల్లో భాగంగా వరుస బాంబు పేలుళ్ల ఘటనలు జరిగాయి. దేశవ్యాప్తంగా జరిగిన 40 బాంబు పేలుళ్ల ఘటనల్లో తుండా ప్రమేయం ఉన్నట్టు ఇంటిలిజెన్స్ వర్గాలు నిర్ధారించాయి. ఢిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో బాంబులు పెట్టేందుకు తుండా ప్రయత్నించినట్టు ఆయనకు జలీల్ అన్సారీ సహకరించినట్టు నిఘావర్గాలు గుర్తించాయి. కొన్నాళ్లపాటు పాకిస్తాన్‌లో తలదాచుకున్న తుండా తర్వాత నేపాల్ సరిహద్దు దాటుతున్న సమయంలో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఘజియాబాద్ జైల్లో ఉన్న తుండాను వీడియోకాన్ఫరెన్సింగ్‌లో నాంపల్లి కోర్టు ముందు హాజరుపరచనున్నారు.