క్రైమ్/లీగల్

చిత్తూరు టౌన్‌బ్యాంకు మాజీ చైర్మన్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఫిబ్రవరి 18: చిత్తూరు కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంకులో గిల్ట్ నగలు తాకట్టు పెట్టి రూ.86లక్షలు రుణంగా తీసుకుని మోసానికి పాల్పడిన కేసులో బ్యాంకు మాజీ చైర్మన్ షణ్ముగంను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన నుంచి ఐదుకిలోల గిల్ట్ నగలు, రెండు కార్లు, రెండు ఇళ్లను సీజ్ చేసినట్లు చిత్తూరు డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి తెలిపారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం చిత్తూరు టౌన్ బ్యాంకు దర్గా బ్రాంచ్‌లో బ్యాంకు మాజీ చైర్మన్ షణ్ముగం, అప్రైజర్ ధరణి దశలవారిగా బ్యాంకులో గిల్ట్‌నగలు తాకట్టు పెట్టి రూ.86లక్షల రుణం తీసుకుని బ్యాంకును మోసగించారని బ్యాంకు మేనేజర్ సుబ్రహ్మణ్యం ఈనెల 13వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల చిత్తూరు టౌన్ బ్యాంకు పరిధిలోని పలు బ్రాంచ్‌ల మేనేజర్లను బదిలీ చేయడంతో, కొత్తగా వచ్చిన బ్రాంచ్ మేనేజర్‌కు బ్యాంకుకు సంబంధించిన ప్రాపర్టీని అప్పగించే సమయంలో ఈ గిల్ట్‌నగల తాకట్టు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో సమగ్ర విచారణ చేపట్టగా షణ్ముగం బ్యాంకు చైర్మన్‌గా ఉన్న సమయంలో అప్రైజర్‌తో కలిసి తన 15మంది బినామిదారుల ద్వారా 43 లోన్ అకౌంటర్లతో దశలవారిగా గిల్ట్‌నగలు తాకట్లు పెట్టి రుణం తీసుకున్నట్లు తేలింది. అయితే ఈ రుణాన్ని చెల్లించాలని పలుమార్లు అప్రైజర్ షణ్ముగంపై వత్తిడి చేసినా, రుణం చెల్లించేది లేదని బెదిరింపులు పాల్పడ్డారని డీఎస్పీ తెలిపారు. పక్కా ప్రణాళికతో బ్యాంకును వీరిరువురు దగా చేసిన సంఘటనలో కేసు నమోదు చేశామన్నారు. ఈ డబ్బులో కొంతమొత్తం బ్యాంకు అప్రైజర్ ధరణిసాగర్‌కు ఇచ్చి మిగిలిన డబ్బుతో తన కుటుంబ సభ్యుల పేర్లతో రెండు కార్లు, చిత్తూరు నగరంలో రెండు ఇళ్లను కొనుగోలు చేశారని, వీటితోపాటు మరికొన్ని స్థిరాస్తులు కూడా కొనుగోలు చేసినట్లు గుర్తించామన్నారు. రెండు కార్లను, రెండు ఇళ్లను, బ్యాంకులో తాకట్టు పెట్టిన ఐదుకిలోల గిల్ట్ నగలను సీజ్ చేశామన్నారు. షణ్ముగంను అరెస్టుచేసి రిమాండ్‌కు పంపించామని డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు షణ్ముగంపై జిల్లాలోని చిత్తూరు, తిరుపతి, బంగారుపాళ్యం ప్రాంతాల్లో 14 కేసులు నమోదయినట్లు తెలిపారు. పలుచోట్ల భూములు ఇప్పిస్తానని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని, తిరుపతిలో ఈనామ్ భూములు తీసిస్తానని, ఇళ్లు నిర్మించి ఇస్తానని నమ్మించి చాలామంది దగ్గర లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసగించినట్లు డీఎస్పీ తెలిపారు. పలు చెక్‌బౌన్స్ కేసులు, విధినిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడం, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసిన ఘటనలలో కేసులు నమోదయ్యాయ. బ్యాంక్‌ను చీటింగ్ చేసిన కేసులో అప్రైజర్ ధరణిని విచారిస్తున్నామని చెప్పారు. షణ్ముగం బాధితులు ఇంకా ఎవరైనా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు.
*చిత్రం... షణ్ముగంను అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసులు