క్రైమ్/లీగల్

బ్యాంకు ఉద్యోగిని హత్య కేసులో నిందితుడు లొంగుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ రూరల్, ఫిబ్రవరి 19 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మంగళవారం జరిగిన బ్యాంకు ఉద్యోగిని దివ్య హత్య కేసు ప్రధాన నిందితుడు వెంకటేష్ గౌడ్ బుధవారం సాయంత్రం వేములవాడ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అంతకు ముందు సిద్దిపేట పోలీసులు నాలుగు బృందాలుగా వేములవాడ వచ్చి నిందితుడి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో వెంకటేష్‌గౌడ్ సాయంత్రం పోలీసులకు లొంగి పోయాడు. ఉన్మాది వెంకటేష్ గౌడ్‌ను గజ్వేల్ పోలీసులకు అప్పగించినట్టు వేములవాడ టౌన్ సీఐ శ్రీ్ధర్ తెలిపారు. కాగా అతడిని పోలీసు కమిషనర్ శే్వత ఆధ్వర్యంలో విచారి స్తున్నట్టు తెలిసింది. కాగా దివ్యతో కలిసి చదువుకున్న వెంకటేష్‌గౌడ్ ఆమెను ప్రేమించమంటూ వేధించేవాడు. దీనికి ఆమె నిరాకరించడం, ఈ నెల 26న ఆమెకు వివాహం నిశ్చయం కావడంతో మంగళవారం గజ్వేల్‌లో ఆమె ఉంటున్నఇంటిలో గొంతుకోసి హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆసుపత్రి వద్ద పోలీసుల ఆందోళన
గజ్వేల్: బ్యాంకు ఉద్యోగిని దివ్య బంధువులు గజ్వేల్ ఆసుపత్రి వద్ద బుధవారం ఆందోళనకు దిగారు. ఉదయం దివ్య తల్లిదండ్రులు లక్ష్మిరాజ్యం, మణెమ్మలతో పాటు బంధువులు పోస్టుమార్టం నిర్వహించకుండా ఆడ్డుకోవటంతో పాటు ఆందోళనకు దిగారు. ఆయితే నిందితులను అరెస్టు చేసిన అనంతరమే పోస్టుమార్టం నిర్వహించాలని అప్పుడే పోలీసులకు సహకరిస్తామని తేల్చిచెప్పారు. దీంతో ఏసీపీ నారాయణ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తేవటంతో పోలీసుకమిషనర్ శే్వత గజ్వేల్‌కు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అలాగే బాధితకుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చూస్తానని వారికి నచ్చజెప్పారు. ఈక్రమంలోవారు వెనక్కి తగ్గగా పోస్టు మార్టం నిర్వహించి దివ్య మృత దేహాన్ని పోలీసుల బందోబస్తు మద్య ఆమె సొంత గ్రామమైన ఎల్లారెడ్డిపేటకు తరలించారు.