క్రైమ్/లీగల్

బాలికపై హత్యాచారం కేసులో రేపిస్టుకు మరణశిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఐదేళ్ల చిన్నారిని అత్యంత హేయంగా రేప్ చేసి హత్య చేసిన కేసులో నిందితుడికి మరణశిక్ష విధించిన వైనం ఇక్కడి పర్బని జిల్లాలో చోటుచేసుకొంది. పైశాచికానందం కోసం చిన్న పిల్ల అని కూడా చూడకుండా అత్యాచారానికి పాల్పడిన ఈ ఉదంతాన్ని ‘అత్యంత క్రూరమైనది’గా భావిస్తూ నిందితుడికి మరణశిక్ష విధించినట్లు పోక్సో కేసుల ప్రత్యేక జడ్జి బుధవారం స్పష్టం చేశారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. ఈ కేసులో నిందితుడు విష్ణు గొరె (30)కు ఐపీసీ 302 సెక్షన్‌లో చిన్నారులపై లైంగిక వేధింపుల నియంత్రణ చట్టం (పోక్సో) కింద మరణశిక్ష విధించారు. ఇక్కడికి 500 కిలోమీటర్ల దూరంలోని పర్బని ప్రాంతంలో ఐదేళ్ల చిన్నారి తన తాత, నానమ్మలతో ఉంటోంది. 2016 సంవత్సరం అక్టోబర్ 27వ తేదీన తాత, నానమ్మ ఇద్దరూ కూలిపనికి బయటకు వెళ్లి వచ్చి చూసే సరికి బాలిక కనపడలేదు. ఆందోళన చెందిన వీరు పరిసర ప్రాంతాల్లో రెండు రోజుల పాటు గాలించినా ప్రయోజనం లేకపోవడంతో సోన్‌పేట పోలీసులను ఆశ్రయించారు. ఆఖరికి గోనె సంచిలో మూటకట్టి బావిలో పడేసి ఉన్న బాలికను రెండు రోజుల తరువాత గుర్తించారు. కేసు పరిశోధన అనంతరం విష్ణు గొరె ఈ దురాగతానికి పాల్పడినట్లు గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. బాలికను కిడ్నాప్ చేసి సమీప పొలాల్లోకి తీసుకెళ్లి అత్యంత క్రూరంగా అత్యాచారం చేయడమే కాకుండా ప్లాస్టిక్ తాడును మెడకు బిగించి హతమార్చినట్లు నేరం రుజువైంది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట నిందితుడు విష్ణు గోరెకు మరణ శిక్ష విధించినట్లు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్డీ వకోడ్కర్ వివరించారు.